అక్షరటుడే, వెబ్డెస్క్: Sri chaitanya | నిజామాబాద్ నగర బైపాస్(Bypass road)లో అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్న శ్రీచైతన్య(Sri chaitanya) విద్యాసంస్థలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం డీఈవో అశోక్(DEO Ashok)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీచైతన్య విద్యా సంస్థలు ఎటువంటి అనుమతులు అడ్మిషన్లు తీసుకుంటోందని వివరించారు. కొందరి రాజకీయ నాయకులు అండదండలతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు. ఈ విద్యాసంస్థపై వెంటనే చీటింగ్ కేసు నమోదు చేసి వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
Sri chaitanya | ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారని రాజేశ్వర్ డీఈవోకు వివరించారు. నిజామాబాద్ జిల్లాలో నర్సరీ నుంచి పదవ తరగతి వరకు రూ. లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు మనోజ్, రవి, సురేష్, పవన్ తదితదిరులు పాల్గొన్నారు.