అక్షరటుడే, వెబ్డెస్క్: President murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కలిశారు. ఈ సందర్భంగా పహల్గామ్లో ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు. అలాగే భారత్ తీసుకున్న చర్యల గురించి తెలిపారు. దౌత్య సంబంధాలకు సంబంధించిన అంశాలను సైతం వివరించారు.
President murmu | వివిధ దేశాల రాయబారులకు సమాచారం
ఉగ్రదాడికి సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ వివిధ చేశాల రాయబారులు వివరించారు. జర్మనీ, జపాన్, పోలాండ్, యూకే, రష్యాతో సహా వివిధ దేశాల రాయబారులు సౌత్ బ్లాక్‌లో ఉన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడి వివరాలను తెలిపారు.