ePaper
More
    Homeక్రైంACB Case | సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం.. మహిళను అరెస్ట్​ చేసిన ఏసీబీ

    ACB Case | సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం.. మహిళను అరెస్ట్​ చేసిన ఏసీబీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | సింగరేణి (Singareni)లో ఉద్యోగం కోసం ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. అయితే నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకొని కొందరు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు. కొత్తగూడెం (Kothagudem Singareni) సింగరేణిలో ఉద్యోగాలు, మెడికల్ అన్‌ఫిట్ (Medical Unfit) విషయంలో డబ్బులు తీసుకున్న విషయంలో గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.

    ఈ కేసులో తాజాగా ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మహిళను ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌కు చెందిన కడాలి చైతన్య మధ్యవర్తిగా వ్యవహరించినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సింగరేణి ఉద్యోగి అన్నబోయిన రాజేశ్వరరావును గతంలోనే అరెస్ట్​ చేశారు. తాజాగా చైతన్యను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఖమ్మం (Khammam acb office) తీసుకెళ్లి విచారిస్తున్నారు.

    ACB Case | రూ.30 లక్షల వరకు వసూలు

    అన్నబోయిన రాజేశ్వరరావు అనే వ్యక్తి సింగరేణి మెయిన్ వర్క్‌షాప్​లో డ్రైవర్​గా పని చేసేవాడు. అయితే ఈయన ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అంతేగాకుండా మెడికల్​ అన్​ఫిట్​ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని, బదిలీలు చేయిస్తానని చెప్పి కార్మికుల నుంచి డబ్బు వసూలు చేశాడు. ఇలా మొత్తం రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో గతంలోనే ఆయన ఇంట్లో తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా మధ్యవర్తిగా వ్యవహరించిన మహిళను తాజాగా అరెస్ట్​ చేశారు. అయితే ఈ కేసులో మరికొంత మంది ఉన్నట్లు సమాచారం. విచారణలో వారి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...