ePaper
More
    Homeక్రైంACB Trap | ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఉద్యోగులు

    ACB Trap | ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఉద్యోగులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | రాష్ట్రంలోని పలు మున్సిపల్(Muncipal)​, రెవెన్యూ (Revenue) కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆయా కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది చేతులు తడపనిదే పనులు చేయడం లేదు. ఆఫీసులకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్నారు. అన్ని సక్రమంగా ఉన్నా.. లంచాలు ఇవ్వకుంటే పనులు చేయకుండా తిప్పుకుంటున్నారు. దీంతో చేసేదేమి లేక ప్రజలు అధికారులకు లంచాలు ఇస్తున్నారు. అయితే పలువురు మాత్రం అధికారులపై ఏసీబీ(ACB)కి ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా లంచం (Bribe) తీసుకుంటూ మున్సిపల్ సిబ్బంది ఏసీబీకి Acb cases today in Telangana చిక్కారు.

    ACB Trap | మ్యూటేషన్​ కోసం రూ.20 వేలు డిమాండ్​

    మేడ్చల్-మల్కాజిగిరి (Medchal Malkajgiri) జిల్లాలోని తూముకుంట పురపాలక కార్యాలయం (tumkunta municipal)లో శ్రావణ్ కంప్యూటరు ఆపరేటర్​గా, కె రాంరెడ్డి శామీర్​పేట వార్డ్ కార్యాలయంలో బిల్ కలెక్టర్​గా పని చేస్తున్నారు. ఓ వ్యక్తి ఇంటి మ్యూటేషన్​ (Mutation number) కోసం వీరిని సంప్రదించగా.. రూ.20 వేలు లంచం డిమాండ్​ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో గురువారం లంచం తీసుకుంటుండగా.. ఇద్దరిని ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

    ACB Trap | ఇంటి నంబర్​ కేటాయించడానికి..

    ఒక వ్యక్తి నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటికి సంబంధించి అంచనా వేయడంతో పాటు, ఇంటి నంబర్​ కేటాయించడానికి లంచం అడిగిన సిబ్బందిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిర్మల్ మున్సిపల్​ కార్యాలయం (Nirmal Municipal acb case)లో గైక్వాడ్​ సంతోష్​ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​గా పని చేస్తున్నాడు. అయితే ఓ వ్యక్తికి సంబంధించిన ఇంటి అసెస్​మెంట్​ కోసం సంతోష్​ రూ.6 వేలు లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. గురువారం రూ.6 వేల లంచం తీసుకుంటుండగా.. రెవెన్యూ ఇన్​స్పెక్టర్ (Revenue Inspector)​ సంతోష్​తో పాటు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎండీ షోయబ్​ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

    ACB Trap | భయపడకుండా ఫిర్యాదు చేయండి

    ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​కు ఫోన్​ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...