ePaper
More
    HomeజాతీయంEncounter | మావోయిస్టులకు మరో షాక్​.. అగ్రనేత సుధాకర్​ హతం

    Encounter | మావోయిస్టులకు మరో షాక్​.. అగ్రనేత సుధాకర్​ హతం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Encounter | మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఇటీవల టాప్​ కమాండర్​ నంబాల కేశవరావు (Nambala Keshavarao) ఎన్​కౌంటర్​ మరువక ముందే మరో కీలక నేత మృతి చెందాడు. ఛత్తీస్​గఢ్ (Chhattisgarh)​లోని బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్​కౌంటర్​ (Encounter)లో మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి చెందాడు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు (Security Focers) సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టాయి.

    భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్​ చేపడుతుండగా.. మావోయిస్టులు ఎదురు పడ్డారు. ఈ క్రమంలో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో మావోల అగ్రకమాండర్ సింహాచలం అలియాస్ సుధాకర్ మృతి చెందాడు. ఆయనపై రూ.50 లక్షల రివార్డు ఉంది.

    Encounter | 40 ఏళ్లుగా ఉద్యమంలో..

    సుధాకర్ స్వస్థలం ఏలూరు (Elooru) జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం. ఆయన 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్య‌మంలో ఉన్నారు. ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్​ ప్రభుత్వం 2004లో చేపట్టిన శాంతిచర్చల్లో సైతం ఆయన పాల్గొన్నారు. సుధాక‌ర్ పూర్తి పేరు తెంటు ల‌క్ష్మీన‌ర‌సింహాచ‌లం. కాగా ఏళ్లుగా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సుధాకర్​ మృతితో మావోయిస్టులకు భారీ నష్టం జరిగిందని చెప్పవచ్చు.

    Encounter | మావోయిస్టుల్లో ఆందోళన

    దేశంలో 2026 మార్చి వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Amit Shah) స్వయంగా పార్లమెంట్​లో ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్​ కగార్ (Operation Kagar)​ చేపట్టింది. దీంతో భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతూ మావోల పని పడుతున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ప్రాంతాలను కూడా భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. దీంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు.

    ఆపరేషన్​ కగార్​లో భాగంగా నిత్యం ఎన్​కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. దీంతో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. అగ్ర నేతలు సైతం నేలకొరుగుతుండడంతో మావోయిస్టుల్లో ఆందోళన నెలకొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్​ కగార్​ను ఆపాలని వారు కోరారు. ఈ మేరకు రెండు మూడు సార్లు లేఖ కూడా విడుదల చేశారు. తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని.. ఆపరేషన్​ను ఆపాలని వారు కోరుతున్నారు. అయితే కేంద్రం మాత్రం చర్చలకు సుముఖత తెలపడం లేదు. మావోయిస్టులు తుపాకులు వదిలి లొంగిపోవాలని సూచిస్తోంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...