RCB
Bengaluru stampede | బెంగ‌ళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. సాయం ప్ర‌కటించిన ఆర్సీబీ

అక్షరటుడే, వెబ్​డెస్క్:Bengaluru stampede | ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్‌ను ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB .. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి కప్ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

ఈ క్రమంలోనే గత 18 ఏళ్లుగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తరుణం రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తమ విజయాన్ని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో జ‌రుపుకోవాల‌ని అనుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్, జనం భారీగా ఎగబడ్డారు. ఆర్సీబీ విక్టరీ జరుపుకునేందుకు భారీగా అభిమానులు రావడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద వేలాది మంది గుమిగూడారు.

Bengaluru stampede | సాయం ప్ర‌క‌ట‌న‌..

భారీగా వచ్చిన స్టేడియానికి పోటెత్తిన ఆర్సీబీ ఫ్యాన్స్‌(RCB Fans)ను అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. ఈ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో అభిమానులు తీవ్ర గాయాల పాలయ్యారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట (stampede) ఘటన నేపథ్యంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నష్ట పరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. అదేవిధంగా గాయపడిన వారి సహాయార్థం ఆర్‌సీబీ కేర్స్‌ పేరిట ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.

“నిన్న బెంగళూరులో జరిగిన దురదృష్టకర ఘటన ఆర్‌సీబీ కుటుంబానికి తీవ్ర బాధను కలిగించింది” అని పేర్కొంది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్టు తెలియ‌జేసింది. అంతేకాదు, గాయపడిన అభిమానులను ఆదుకునేందుకు “ఆర్‌సీబీ కేర్స్‌ పేరిట ఫండ్‌ ఏర్పాటు చేస్తాం RCB cares fund’ అని ఆర్‌సీబీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందచేస్తామని కర్ణాటక (Karnataka) ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.