ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిWorld Environment Day | పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేద్దాం

    World Environment Day | పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేద్దాం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: World Environment Day | పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్​ కిరణ్​ కుమార్​ (Additional Collector Kiran Kumar) అన్నారు. ప్లాస్టిక్ ద్వారా వ్యాప్తి చెందుతున్న కాలుష్యాన్ని అంతం చేసేవరకు పోరాడాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం బాల భవన్ నుంచి న్యూ అంబేడ్కర్​ భవన్ వరకు గ్రీన్ ర్యాలీ (Green Rally) నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం, పచ్చదనాన్ని పెంచడం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. అనంతరం కాలుష్యంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో రీజనల్ పర్యావరణ అధికారి లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు.

    World Environment Day | సంగెం గ్రామంలో..

    అక్షరటుడే, బాన్సువాడ: ప్లాస్టిక్​ను నివారించి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (District SC, ST Vigilance and Monitoring Committee) సభ్యులు సునీల్ రాథోడ్ సూచించారు. నస్రుల్లాబాద్​ మండలం సంగెం గ్రామంలో మేరా యువ భారత్ (Mera Yuva Bharath), సేవా సంఘం ఫ్రెండ్స్ యూత్, జీపీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జీపీ సెక్రెటరీ అనిల్, సేవాసంఘ్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు మహేందర్, లాల్ సింగ్, మోహన్, రానా, బాబు తదితరులు పాల్గొన్నారు.

    World Environment Day | ఇందల్వాయిలో..

    అక్షరటుడే, ఇందల్వాయి: మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ఎఫ్ఆర్వో రవి మోహన్ భట్ (FRO Ravi Mohan Bhat) అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇందల్వాయిలోని ఫారెస్ట్ నర్సరీలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటరావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నవీన్ గౌడ్, జల సంఘం అధ్యక్షుడు గట్టు కడారి, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

    World Environment Day | బోధన్​లో..

    అక్షరటుడే, బోధన్: పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతిఒక్కరిదని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato) అన్నారు. పర్యావరణ దినోత్సవ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ, మున్సిపల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

    World Environment Day | ఆర్మూర్​లో..

    అక్షరటుడే, ఆర్మూర్: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి(Congress Constituency In-charge Vinay Reddy) అన్నారు. ఆర్మూర్​ పట్టణంలో నిర్వహించిన వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, ఆర్మూర్ మార్కెట్ యార్డు(Armoor Market Yard) ఛైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ పండిత్ పవన్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ మున్నాభాయ్, కౌన్సిలర్ రహమాన్, నర్సయ్య, మురళి, ఇంతియాజ్​, ఫయాజ్, కాంగ్రెస్ నాయకులు మజిత్ భాయ్, మారుతి రెడ్డి, గిరి, రవికాంత్ రెడ్డి, అజ్జు భాయ్, జిమ్మీ రవి, భుపేందర్ పాల్గొన్నారు.

    Latest articles

    Aditya Infotech | అదరగొట్టిన ‘ఆదిత్య’.. ఇన్వెస్టర్లను ముంచేసిన కాయ్‌టెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aditya Infotech | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో...

    Register Post | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం.. నిలిచిపోనున్న రిజిస్టర్​ పోస్ట్​ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Register Post | పోస్టల్​ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్​ పోస్ట్​ సేవలను నిలిపి...

    Deepika Padukone | రికార్డుల‌కెక్కిన దీపికా పదుకొనే.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ్యూస్ దాటిన ఆమె రీల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు....

    Harish Rao | బీఆర్​ఎస్​పై ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​, బీజేపీ కలిసి బీఆర్​ఎస్​పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి...

    More like this

    Aditya Infotech | అదరగొట్టిన ‘ఆదిత్య’.. ఇన్వెస్టర్లను ముంచేసిన కాయ్‌టెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aditya Infotech | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో...

    Register Post | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం.. నిలిచిపోనున్న రిజిస్టర్​ పోస్ట్​ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Register Post | పోస్టల్​ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్​ పోస్ట్​ సేవలను నిలిపి...

    Deepika Padukone | రికార్డుల‌కెక్కిన దీపికా పదుకొనే.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ్యూస్ దాటిన ఆమె రీల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు....