అక్షరటుడే, వెబ్‌డెస్క్: JEE Advanced Results | అధ్యాపకుల ప్రోత్సాహంతో తొలిప్రయత్నంలోనే జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించానని శివ తెలిపారు. ఒలంపియాడ్ విద్యతో పాటు విద్యాసంస్థలో ఇచ్చిన ప్రత్యేక శిక్షణతో లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకోకుండా 1,299 ర్యాంకు సాధించానని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ శిక్షణ ఇవ్వడం వల్ల ఈ విజయం సాధ్యమైందన్నారు. జాతీయ స్థాయి ర్యాంకు సాధించిన నేపథ్యంలో తన మనోగతాన్ని పంచుకున్నారు.
‘నేటి ఆధునిక ప్రపంచంతో పోటీ పడాలంటే ఒలంపియాడ్ విద్య (Olympiad education) ఎంతో అవసరం. ఇక్కడ అందించే ప్రత్యేక శిక్షణ వల్ల జాతీయస్థాయిలో రాణించగలుగుతాం. కాకతీయలో స్పెషల్ క్లాసులు, అధ్యాపక బృందం శ్రద్ధ వల్ల జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించాను. ఇందుకు స్కూల్ స్థాయి నుంచి జాతీయ స్థాయిలోనే అందిన ఐఐటీ, మెడికల్ విద్య ప్రవేశ పరీక్షా ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించడానికి దోహదపడింది.
JEE Advanced Results | చక్కటి ప్రణాళికతో ముందుకు..
‘నేను కాకతీయలో పాఠశాల స్థాయి నుంచే జేఈఈ, ఐఐటీ ఫౌండేషన్ (JEE IIT Foundation) అందుకున్నాను. ఫ్యాకల్టీ ఇచ్చిన సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ చదివాను. లెక్చరర్లు చక్కని ప్రణాళికతో మాకు టీచింగ్ చేశారు. వారు ఇచ్చిన ఫౌండేషన్‌తో నేను జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా ఉంది. బాగా చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెబుతుండేవారు. అందుకే నన్ను మంచి విద్యాసంస్థలో చేర్పించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల శిక్షణతో.. నిత్యం ప్రణాళిక ప్రకారం చదువుకోవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది.’ అని శివ తెలిపారు.