ePaper
More
    HomeసినిమాJr. NTR | ఎన్టీఆర్ తాగిన డ్రింక్ స్పెషాలిటీ ఏంటి.. అది అంత కాస్ట్‌లీనా?

    Jr. NTR | ఎన్టీఆర్ తాగిన డ్రింక్ స్పెషాలిటీ ఏంటి.. అది అంత కాస్ట్‌లీనా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Jr. NTR | యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ NTR పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నారు.

    ఇండియన్ మాస్ యాక్షన్ సినిమాల స్థాయిని పెంచిన ప్రశాంత్ నీల్ తో క‌లిసి డ్రాగ‌న్(Dragon) అనే సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రం ఇప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులను చెరిపేస్తూ, కొత్త రికార్డులు నెలకొల్పనుందని NTR Fans ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. దీనిని 2026 జూన్ 25న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్(NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కలయికపై ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

    Jr. NTR | ఏంటి ఆ వాట‌ర్ ..

    అయితే తాజాగా ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. జూనియ‌ర్ ఇటీవల తన బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్ 2’ MAD 2 సినిమా ఈవెంట్‌కి చీఫ్ గెస్టుగా హాజరై సంద‌డి చేశారు. చిత్ర బృందాన్ని పేరు పేరునా అభినందించారు. పావు గంటకు పైగానే మాట్లాడారు. ఎన్టీఆర్ స్పీచ్, ఫోటోలు, వీడియోలు నెట్టింట సందడి చేశాయి. అయితే వాటిల్లో తారక్ చేతిలో ఓ బాటిల్ ఉండటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ గ్రీన్ కలర్ బాటిల్ ఉన్న ఓ డ్రింక్(Drink) తాగాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి? ఆ బాటిల్ ధర ఎంత? స్పెషాలిటీ ఏంటి? అని నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేసారు.

    ఈక్రమంలోనే ఆ డ్రింక్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.అందరూ అనుకుంటున్నట్టు ఎన్టీఆర్ చేతిలో ఉంది మద్యం బాటిల్ కాదు. ఆయన తాగింది బీరో లేదా మరోదే ఇతర ఎనర్జీ డ్రింక్ కూడా కాదు. అది జస్ట్ వాటర్ మాత్రమే. పెరియర్ (Perrier water) అనే కంపెనీకి చెందిన కార్బోనేటేడ్ స్పార్క్లింగ్ (Carbonated sparkling) నేచురల్ మినరల్ వాటర్ బాటిల్ అని తెలుస్తుంది.

    ఇందులో ఎలాంటి మినరల్స్ జోడించకుండా, క్యాలరీలు లేకుండా ఉండే స్వ‌చ్ఛ‌మైన నీరు ఉంటుందట.! డైట్ లో ఉన్న వాళ్ళు ఈ వాటర్ తీసుకుంటారట. స్పార్క్లింగ్ మినరల్ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడవట. అంతేకాకుండా ఇది హైడ్రేటెడ్(Hydrated)గా ఉంచడంలో సహాయపడుతుందని అంటున్నారు. 1992 నుంచి ఇది అందుబాటులో ఉంది. ప్రస్తుతం 140 దేశాల్లో ఈ మినరల్ వాటర్ ని విక్రయిస్తున్నారు. ఇది 330 ML బాటిల్స్ లో దొరుకుతుంది. ధర సుమారు 165 రూపాయలు. ఆన్ లైన్ లో ఆఫర్స్ ని బట్టి ఒక్కో బాటిల్ 145 నుంచి, బల్క్ ఆర్డర్లో తీసుకుంటే తక్కువ ధరలో దొరుకుతాయి.

    Latest articles

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    More like this

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...