RCB Fans
RCB Fans | ఆర్సీబీ గెలిస్తే బాత్ ట‌బ్ వీడియో షేర్ చేస్తానన్న ఫ్యాన్.. అన్న‌ట్టే చేసిందిగా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్:RCB Fans | ఈ సీజ‌న్‌లో ఆర్సీబీ RCB ప్ర‌తి మ్యాచ్ కూడా చాలా ఫోక‌స్‌తో ఆడింది. క్వాలిఫ‌యర్ 1లో పంజాబ్‌ని ఓడించి ఫైన‌ల్‌కి వెళ్లింది. మ‌ళ్లీ ఫైన‌ల్‌లోను పంజాబ్‌ని మ‌ట్టికరిపించి ట్రోఫీ(IPL Trophy) గెలుచుకుంది.

18 ఏళ్ల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ ఎట్టకేలకు జూన్ 3న రాత్రి పండగ చేసుకున్నారు. 18 ఏళ్ల నిరీక్షణ ఫలించి ఆర్సీబీ తొలిసారి కప్పు కొట్టిన వేళ అటు ఫ్రాంచైజీ, జట్టు సభ్యులు, ఇటు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విరాట్ కోహ్లీ(Virat Kohli) అయితే మ్యాచ్ అనంతరం మోకాళ్లపై కూర్చిండిపోయాడు. ఆనందంతో అతని కళ్లు చెమ్మగిల్లాయి.

RCB Fans | అలా చేసింది ఏంటి?

తరువాత తన భార్య అనుష్క శర్మను Anushka sharma ఆలింగనం చేసుకొని సంబరాలు చేసుకున్నాడు. పంజాబ్​ కింగ్స్(Punjab Kings)​పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ. మరోవైపు ఇప్పటి వరకు ఐపీఎల్ కప్పు కొట్టని పంజాబ్ కింగ్స్​కు మరోసారి నిరాశ ఎదురైంది. 18 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ఐపీఎల్(IPL) ను ఆర్సీబీ సొంతం చేసుకోవడంతో ఆ జట్టు అభిమానులు సంబరాలు ఓ రేంజ్‌లో చేసుకున్నారు. అంతేకాదు కర్ణాటక రాష్ట్ర ఖజానాలోభారీ మొత్తం కూడా జమైంది.

మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఆర్సీబీ అభిమానులు బీర్లు, మద్యంతో సంబరాలు చేసుకున్నారు. ఒకే రోజులో, రాష్ట్రంలో 1.48 లక్షల బీరు కేసులు అమ్ముడయ్యాయి. బీర్లు అమ్మడం ద్వారా రూ.30 కోట్ల 66 లక్షలు ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. ఇది కాకుండా.. 1.28 లక్షల విలువైన ఇతర మద్యం కూడా అమ్ముడైంది

ఇక కొంద‌రు ఫ్యాన్స్ ఆర్సీబీ గెలిస్తే బంపర్ ఆఫ‌ర్స్ కూడా ప్ర‌క‌టించారు. ఒక మ‌హిళా ఫ్యాన్స్ ఆర్సీబీ ఓడిపోతే తాను త‌న భ‌ర్త‌ని వ‌దిలేస్తాన‌ని క‌టౌట్‌తో మ్యాచ్‌లో క‌నిపించింది. ఆర్సీబీ గెల‌వ‌డంతో త‌న భర్త సేఫ్‌. ఇక ఒక ఫ్యాన్స్ అయితే ఆర్సీబీ గెలిస్తే బాత్ ట‌బ్ (Bath tub video) వీడియో షేర్ చేస్తాన‌ని చెప్పింది. అలానే షేర్ చేసి నెటిజ‌న్స్‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించింది. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఆర్సీబీ గెలిచిన స‌మ‌యంలో ప్రేమప‌క్షులు ముద్దుల‌లో మునిగి తేలారు. ఇలా ఎవ‌రికి న‌చ్చిన స్టైల్‌లో వారు సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్నారు.