అక్షరటుడే, వెబ్‌డెస్క్: New blood test : శిశువులు, చిన్నారుల్లో అరుదైన జన్యుపరమైన వ్యాధులను వేగంగా నిర్ధారించగల కొత్త రకం బ్లడ్ టెస్ట్ ను ఆస్ట్రేలియా పరిశోధకులు(Australian researchers) అభివృద్ధి చేశారు. రక్త ఆధారిత పరీక్షల ద్వారా క్విక్ రిజల్ట్స్, ట్రీట్ మెంట్ అందించే ప్రయత్నంలో ఈ కొత్త రక్త పరీక్ష విధానాన్ని కనుగొన్నారు.
ఆస్ట్రేలియా(Australia)లోని మెల్బోర్న్ వర్సిటీ (University of Melbourne), ముర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు (Murdoch Children’s Research Institute) ఈ బ్లడ్ టెస్ట్ ను డెవలప్ చేశారు. దీని ద్వారా తక్కువ ఖర్చు, అతితక్కువ సమయంలోనే రోగ నిర్ధారణ చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
New blood test | జన్యుపరమైన రోగాలను నిర్ధారించడం కోసం..
సాధారణంగా రక్త పరీక్ష ద్వారా సిస్టిస్ ఫైబ్రోసిస్ నుంచి మానవ కణాల శక్తి కేంద్రాలైన మైటో కాండ్రియాకు సంబంధించిన వ్యాధుల వరకు జన్యుపరమైన అనేక రోగాలను నిర్ధారించడం క్లిష్టమైనది. కానీ, కొత్తగా రూపొందించిన బ్లడ్ టెస్ట్ ద్వారా ఇవన్నీ తేలికగా కచ్చితత్వంతో పాటు వేగంగా చేయొచ్చు. మైటోకాన్డ్రియల్ వ్యాధుల (mitochondrial diseases) రక్తపరీక్ష(కొత్తగా రూపొందించిన టెస్ట్)కు నవజాత శిశువు నుంచి 1 మి.లీ రక్తం తీసుకుంటే సరిపోతుంది. కానీ, ప్రస్తుత పద్ధతుల్లో కండరాల బయాప్సీ ఉండటం వల్ల, అనేకమార్లు టెస్టులు చేయాల్సి వస్తోంది. దీనికి చాలా రోజుల సమయం పడుతోంది. కొత్త టెస్ట్ తో ఈ సమస్యలన్నింటికి పరిష్కారం లభించినట్లైంది.
New blood test | ప్రతీ 2 వేల మందిలో ఒకరికి
ప్రతీ 2 వేల మందిలో ఒకరికి వచ్చే ఈ అరుదైన జెనటిక్ డెసీస్(genetic diseases) లు సుమారు ఏడు వేల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధులు ప్రాణాంతకమైనవని మెల్బోర్న్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డేవిడ్ పేర్కొంటున్నారు. పిల్లలకు కండరరాల బయాప్సీ, ఇన్వాసివ్ పరీక్షలు చేయకుండానే జెనటిక్ డిసీస్ నిర్ధారణ చేయొచ్చని చెబుతున్నారు. ఈ పరీక్షలకు గతంలో మాదిరిగా శిశువుకు అనస్థీషియా అవసరం లేదంటున్నారు. మైటోకాండ్రియల్ వ్యాధులపై పరిశోధనలు చేసిన MCRI లోని విక్టోరియన్ క్లినికల్ జెనెటిక్స్ సర్వీసెస్(Victorian Clinical Genetics Services) గుర్తింపు పొందిన ఎంజైమ్‌తో ఈ పరిశోధకులు తమ పరీక్షలను బెంచ్ మార్క్ చేశారు.