kuldeep yadav engaged to childhood friend
kuldeep yadav | చిన్న‌నాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధ‌మైన కుల్దీప్ యాద‌వ్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: kuldeep yadav | భార‌త జ‌ట్టు స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ (Kuldeep Yadav) మరి కొద్ది రోజుల‌లో పెళ్లి పీట‌లు ఎక్కేందుకు సిద్ధ‌మ‌య్యాడు. త‌న గూగ్లీతో బ్యాట‌ర్ల‌ను బోల్తా కొట్టించే ఈ చైనామ‌న్.. ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బుధ‌వారం అత‌ని నిశ్చితార్థం కాగా, త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నాడు. బాల్య స్నేహితురాలు వన్షికకు కుల్‌దీప్ యాదవ్ ఉంగరం తొడిగాడు. అనంత‌రం ఆమె కూడా అత‌డికి ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ల‌క్నోలో కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కుల్దీప్, వంశిక (Vanshika) ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

kuldeep yadav | చిన్న‌నాటి స్నేహితురాలితో..

కుల్దీప్, వంశికల నిశ్చితార్థ వేడుకకు భారత యువ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) తదితరులు హాజరైనట్లు సమాచారం. ఇక ఎంగేజ్‌మెంట్ వేడుక(engagement ceremony)లో కుల్‌దీప్ యాదవ్ క్రీమ్ క‌ల‌ర్ ప్యాంట్, సూట్ ధ‌రించాడు. అటు వ‌న్షిక ఎరుపు రంగు ఎంబ్రాయిడ‌రీ లెహెంగాలో మెరిసింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025లో కుల్‌దీప్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఈ సీజన్‌లో 7.08 ఎకాన‌మీతో 15 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న కుల్‌దీప్ యాదవ్.. త్వ‌ర‌లోనే లండన్ వెళ్లనున్నాడు. ఈ పర్యటన తర్వాతే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

వంశిక విషయానికి వస్తే.. ఆమె ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం, లక్నో(Lucknow)లోని శ్యామ్ నగర్ నివాసి. ప్రస్తుతం ఎల్ఐసీ(LIC)లో ఉద్యోగం చేస్తున్నారు. కుల్దీప్‌తో ఆమెకు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఆ స్నేహం ప్రేమగా మారడంతో ఇరువురి కుటుంబసభ్యులు వివాహానికి అంగీకరించారు. దీంతో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన వారిలో యూపీలోని సమాజ్‌వాద్ పార్టీ ఎంపీ(UP’s Samajwad Party MP), రింకూ సింగ్‌(Rinku Singh)కు కాబోయే సతీమణి ప్రియా సరోజ్ ఉన్నారు.. ఆమె త‌న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుల్‌దీప్ యాదవ్, వన్షిక Vanshika జోడీకి కంగ్రాట్స్ చెప్పారు.