Covid
Bio-war | వామ్మో డ్రాగన్​ కుట్రలు.. చైనా బయో యుద్ధం!.. పంటలపై హానికరమైన ఫంగస్​ వైరస్​ ప్రయోగం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కరోనా(CORONA) వైరస్​.. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కోట్లాది ప్రాణాలను హరించింది. కాగా, ఈ కొవిడ్(COVID 19)​ వైరస్​ చైనా ప్రయోగశాలలో రూపొందిందనేది జగమెరిగిన సత్యం. ఇదిలా ఉంటే, డ్రాగన్​ దేశం మరో కుట్రకు తెర లేపినట్లు తెలుస్తోంది. ఈసారి పంటలపై వైరస్​ ప్రయోగాలు చేస్తున్నట్లు తాజా ఘటనతో తెలుస్తోంది. పంటల(crops)ను నాశనం చేయడం ద్వారా ప్రపంచ దేశాలను చైనా ఆర్థికంగా, వాణిజ్యంగా దెబ్బ తీయాలని చూస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అమెరికాలో పంటల్ని నాశనం చేసేందుకు చైనా(CHINA) పన్నిన కుట్రలు వెలుగు చూశాయి. పైకి పరిశోధన పేరుతో.. వాస్తవానికి ముప్పును తలపెట్టే చర్యలను అధికారులు గుర్తించారు. చైనా శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరు హానికరమైన ఫంగస్ ద్వారా వ్యాపించే వ్యాధులను అమెరికా భూభాగాల్లో (American territory) ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

Bio-war : రీసెర్చ్ ముసుగులో పన్నాగం

పొలాల్లో దాడులు జరిపేందుకు ఉపయోగించే ఒక ప్రత్యేకమైన ఫంగల్ (fungas) పై పరిశోధన చేస్తున్నట్లు పైకి ఆధారాలు చూపించిన చైనా పరిశోధకులు.. వాస్తవానికి అమెరికా పంటలపై దాడి చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు యూఎస్​ గూఢచారులు నిర్ధారించారు. ఈ ఫంగస్ కు ధాన్యం, మొక్కజొన్న, గోధుమ వంటి ముఖ్యమైన పంటలను సమూలంగా నాశనం చేసే సామర్థ్యం ఉన్నట్లు తెలిసింది.

Bio-war : ఎలా దొరికారంటే..

అమెరికాలోని ఒక ప్రయోగశాల వద్ద చైనా శాస్త్రవేత్తలు(Chinese scientists) అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండగా FBI , వ్యవసాయ విభాగం అధికారులు గుర్తించి అప్రమత్తమయ్యారు. వారి పత్రాలను, కమ్యూనికేషన్‌లను విశ్లేషించారు. విచారణలో అధికారికంగా నమోదుకాని ఫంగస్ శాంపిళ్లు, పంటలపై ప్రయోగాల డేటా, చైనా ప్రభుత్వం(Chinese government)తో అనుబంధాలు వెలుగుచూశాయి.

Bio-war : నష్టమేంటంటే..

ఈ ఫంగస్ వల్ల పంటల నాణ్యత తగ్గుతుంది. దీంతోపాటు మొత్తం పంట చేతికి రాకుండా నాశనం కావొచ్చు. ఫలితంగా వాణిజ్య పరంగా వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుంది. దీనికితోడు ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది.

Bio-war : మనకు ముప్పు ఉందా..

ఈ ఫంగస్ అమెరికాతోపాటు గాలి ద్వారా ఇతర దేశాలకు వ్యాపించే అవకాశముంది. చైనా బయో వార్ మాయాజాలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ప్రభావితం చేయగలదు. భారత్​ వంటి వ్యవసాయాధారిత దేశాలు ఇలాంటి బయోలాజికల్ దాడులపై వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.