Gandhari
Gandhari | ఆర్‌ఎంపీ, పీఎంపీలపై కేసు నమోదు

అక్షరటుడే, గాంధారి : Gandhari | మండలంలో పలువురు ఆర్‌ఎంపీ(RMP), పీఎంపీ(PMP)లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) తెలిపారు. ఈ మేరకు బుధవారం మెడికల్‌ కౌన్సిల్‌ అధికారులు, పోలీసు శాఖ సంయుక్తంగా పలు క్లినిక్‌లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నలుగురు ఆర్‌ఎంపీ, పీఎంపీలు అర్హతకు మించి వైద్యం అందిస్తుండడంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని ఆయన సూచించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.