ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​AP Cabinet Meeting | ఏపీ క్యాబినేట్‌లో కీల‌క నిర్ణ‌యాలు.. చ‌ర్చ‌కు వ‌చ్చిన ప‌లు అంశాలు..

    AP Cabinet Meeting | ఏపీ క్యాబినేట్‌లో కీల‌క నిర్ణ‌యాలు.. చ‌ర్చ‌కు వ‌చ్చిన ప‌లు అంశాలు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: AP Cabinet Meeting | తాజాగా జ‌రిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో (AP cabinet meeting) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 9 అంశాలు అజెండాగా ఈ సమావేశం జరిగిన‌ట్టు తెలుస్తుంది.. అమరావతిలో రెండో దశ భూసేకరణకు క్యాబినెట్ (Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అమరావతి (Amaravati) రెండో దశలో 44వేల ఎకరాల భూమి సేకరించే అంశంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. అమరావతిలో 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం (international airport) నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా (YSR district to YSR Kadapa district) మారుస్తూ తీసుకొచ్చిన జీవోకు ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్.

    READ ALSO  Gold Seized | ఎయిర్​పోర్టులో 25 కిలోల బంగారం పట్టివేత.. దంపతుల అరెస్ట్​

    AP Cabinet Meeting | ఏమేం చ‌ర్చ‌కు వ‌చ్చాయంటే..

    మూడు గంటలకు పైగా సమావేశం జరిగింది. 9 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్. పలు రాజకీయ అంశాలు, రాష్ట్రంలో తాజా పరిణామాలు, ఏడాది పాలన, అందులోని లోటుపాట్లపై చర్చించారు. జీఎల్డీ టవర్ టెండర్లకు (GLD tower tenders) క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే హెచ్ఓడీకి నాలుగు టవర్ల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతిలో (Amaravati) వివిధ పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చేలా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. రెండో దశలో అమరావతిలో 44వేల ఎకరాల భూమిని సేకరించే అంశంపై చర్చ జరిగింది. ఇందులో 5వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ (international sports complex), 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ హబ్ (smart industries hub) నిర్మాణంపై డిస్కస్ చేశారు. పలు సంస్థలకు భూకేటాయింపులపై క్యాబినెట్ లో చర్చించారు. తల్లికి వందనం స్కీమ్ అమలుపైనా క్యాబినెట్ లో చర్చించారు. కూటమి సర్కార్ ఏడాది పాలనపైనా చర్చించారు. ఇంకా ఎన్ని స్కీమ్ లు Schemeపెండింగ్ లో ఉన్నాయి అనే అంశంపైనా చర్చ జరిగింది. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని మంత్రులతో చెప్పారు చంద్రబాబు. నేరం రుజువయ్యాక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించటమే మన విధానం అన్న చంద్రబాబు.. రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదని తేల్చి చెప్పారు. ఈ తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.

    READ ALSO  Liquor Scam | లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్

    Latest articles

    SP Rajesh Chandra | భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, గాంధారి: SP Rajesh Chandra | భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా...

    Engineering Colleges | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు కమిటీ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Engineering Colleges | ఇంజినీరింగ్ (Engineering)​, ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు...

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    More like this

    SP Rajesh Chandra | భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, గాంధారి: SP Rajesh Chandra | భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా...

    Engineering Colleges | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు కమిటీ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Engineering Colleges | ఇంజినీరింగ్ (Engineering)​, ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు...

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...