అక్షరటుడే, బోధన్: Bodhan ACP | ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ bodhan Acp srinivas అన్నారు.
ఈనెల 7న బక్రీద్ సందర్భంగా బోధన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో ముస్లిం మతపెద్దలతో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులకు సహకరించాలని, సోషల్ మీడియాలో పుకార్లు నమ్మవద్దని సూచించారు. ఏమైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐ వెంకటనారాయణ Bodhan ci Venkat narayana, మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ muncipal commissioner Venkat narayana, తదితరులు పాల్గొన్నారు.