ePaper
More
    HomeతెలంగాణDeputy CM Bhatti | ఉద్యోగులకు శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి

    Deputy CM Bhatti | ఉద్యోగులకు శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Deputy CM Bhatti | ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) శుభవార్త చెప్పారు.

    ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రుల సబ్ కమిటీ, అధికారుల కమిటీని నియమించారని తెలిపారు. బుధవారం సచివాలయంలో సబ్ కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు (ministers Sridhar Babu), పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు తదితరులతో కలిసి ఆయన ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు.

    Deputy CM Bhatti | బకాయిలు పేరుకుపోవడంతో..

    కొన్నేళ్లుగా ఉద్యోగులకు (employees) సంబంధించిన బకాయిలు పేరుకుపోయాయని భట్టి తెలిపారు. దీంతో అన్ని ఒక్కసారిగా చేయలేకపోయామని చెప్పారు. ఇక ఉద్యోగుల సమస్యలను పెండింగ్​లో పెట్టకుండా పరిష్కరించేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ సీఎం ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. కాళేశ్వరం కమిషన్​ (Kaleshwaram Commission), వానాకాలం సాగు సీజన్​, ఉద్యోగుల సమస్యలపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అయింది.

    Deputy CM Bhatti | ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నాం..

    ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) తెలిపారు. గత పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనతో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు (financial difficulties) తలెత్తాయన్నారు. అయినప్పటికీ ఉద్యోగులకు మేలు చేయాలని తమ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. అందులో భాగంగానే వారికి ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని వెల్లడించారు. వనరులు సమకూర్చుకొని ప్రజలపై అదనంగా భారం పడకుండా ఉద్యోగుల (employees) డిమాండ్లు నెరవేరుస్తామన్నారు.

    More like this

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...