అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Magam Ranga Reddy | మాజీ ఎమ్మెల్సీ(Former MLC) మాగం రంగారెడ్డి (Rangareddy) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతున్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పని చేసిన రంగారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి (Kiran Kumar Reddy)కి సన్నిహితుడు. ఈ క్రమంలో కిరణ్ కుమార్‌రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత ఆయన కూడా అదే పార్టీలో చేరారు. ప్రస్తుతం రంగారెడ్డి బీజేపీ(BJP)లో ఉన్నారు.
ఆయన మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్ సంతాపం తెలిపారు. కాగా ఆయన అంత్యక్రియలను గురువారం శామీర్‌పేటలో నిర్వహించనున్నారు.