ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | భిక్షాటన కోసం రెండేళ్ల బాలుడి కిడ్నాప్.. మూడు గంటల్లోనే ఛేదించిన పోలీసులు

    Kamareddy | భిక్షాటన కోసం రెండేళ్ల బాలుడి కిడ్నాప్.. మూడు గంటల్లోనే ఛేదించిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భిక్షాటన చేసేందుకు రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఓ జంట చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. కిడ్నాప్​ ఘటన కామారెడ్డి పట్టణంలో బుధవారం చోటుచేసుకోగా పోలీసులు మూడు గంటల్లో కేసును ఛేదించారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) మీడియాకు వివరాలు వెల్లడించారు. భిక్కనూరుకు (Bhikkanur) చెందిన మక్కాల నర్సింలు అనే వ్యక్తి భార్యా పిల్లలతో కామారెడ్డిలో భిక్షాటన చేస్తుంటాడు.

    రోజూ మాదిరిగానే మంగళవారం భిక్షాటన అనంతరం రాత్రి సిరిసిల్ల రోడ్డులో (Sircilla Road) ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద నిద్రించారు. అర్ధరాత్రి లేచి చూసేసరికి తమ కుమారుడు హర్షిత్ కనిపించకపోయేసరికి బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏఎస్పీ ఆధ్వర్యంలో సీఐ, ఎస్సైలు మూడు బృందాలుగా సీసీ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.

    ఓ జంట బాబును ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు వారిని కామారెడ్డి రైల్వే స్టేషన్ (railway station) వద్ద బాబుతో భిక్షాటన చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కిడ్నాప్ చేసిన జంట దోమకొండకు చెందిన పల్లపు రాజు, పల్లపు శారదగా పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. మూడు గంటల్లో బాబు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ ఎస్సై శ్రీరాం, సిబ్బంది పాల్గొన్నారు.

    More like this

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...