అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anganwadi | ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల(Anganwadi centers) ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తోంది. పిల్లల్లో పోషకాహార లోపం (Malnutrition) లేకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చిన్నారులకు బాలామృతం, కేంద్రాలకు వచ్చే పిల్లలకు రోజుకు ఒక గుడ్డు అందిస్తున్నారు. మూడేళ్లలోపు పిల్లలకు నెలకు 16 గుడ్లు అందజేస్తున్నారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఇక నుంచి చిన్నారులకు ఎగ్ బిర్యానీ (Egg Biryanai) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారానికి రెండు, మూడు సార్లు వడ్డించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇస్తున్న భోజనాన్ని మరింత రుచికరంగా అందించేందుకు చర్యలు చేపట్టినట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. బుధవారం రాజేంద్ర నగర్లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు.
Anganwadi | పిల్లలు ఉల్లాసంగా గడిపేలా..
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు ఉల్లాసంగా గడిపేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అలాగే ఉదయం పూట అంగన్వాడీ సమయానికి బెల్ కొట్టాలని ఆదేశించారు. దీంతో పిల్లలు, సిబ్బంది సమయానికి కేంద్రానికి చేరుకుంటారని వివరించారు. సెంటర్లలో 57 రకాల ఆటవస్తువులను అందుబాటులో ఉంచుతామని ఆమె తెలిపారు.
Anganwadi | త్వరలో 14 వేల ఖాళీల భర్తీ
అంగన్వాడీ సిబ్బందిపై పనిభారం తగ్గించడానికి త్వరలో పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులను (Anganwadi posts) భర్తీ చేస్తామన్నారు. అలాగే కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు నేలపై కూర్చోడానికి ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారి కోసం బెంచీలను సరఫరా చేస్తామని ఆమె తెలిపారు. అంగన్వాడీ టీచర్లకు సైతం త్వరలో నూతన మొబైల్స్ (New Mobiles) అందిస్తామని వెల్లడించారు. కేంద్రాలకు నాసిరకం సరుకులు సరఫరా చేసే సప్లయర్స్‌ను బ్లాక్ లిస్టులో పెడుతున్నామని వివరించారు.
Anganwadi | సెల్ఫీ విత్ అంగన్వాడీ..
ఇందిరమ్మ అమృతం (indiramma amrutham) ద్వారా కౌమార బాలికలకు పోషకాలతో కూడిన చిక్కిలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. దీని కోసం సెల్ఫీ విత్ అంగన్వాడీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సెంటర్లలో పిల్లల సంఖ్య పెంచేందుకు అమ్మమాట – అంగన్వాడీ బాట కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు.