అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)పై అలహాబాద్ హైకోర్టు (alahabad high court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్మీ(army)పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని.. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హద్దులు మీరొద్దని హైకోర్టు హెచ్చరించింది. 2022లో చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) లో రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాల్వన్ ఘటన (Galvan incident)పై ఆయన వ్యాఖ్యలను హైకోర్టు తప్పు పట్టింది.
చైనా సైనికులు(China Soldiers) అరుణాచల్ ప్రదేశ్‌లో మన ఆర్మీపై దాడులు చేస్తున్నారని.. సైనికులను కొడుతున్నారంటూ రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. 20 మంది భారత సైనికులను చైనా హతమార్చిందన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
Rahul Gandhi | హద్దులు మీరొద్దు
కాంగ్రెస్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హద్దులు మీరొద్దని హెచ్చరించింది. భవిష్యత్తులో సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని రాహుల్‌ను హైకోర్టు హెచ్చరించింది.