- Advertisement -
Homeఫొటోలు & వీడియోలుViral Video | బాబోయ్ .. వీళ్ల పిచ్చి పీక్స్‌కి వెళ్లింది.. ఆర్సీబీ గెలిచింద‌ని అందరి...

Viral Video | బాబోయ్ .. వీళ్ల పిచ్చి పీక్స్‌కి వెళ్లింది.. ఆర్సీబీ గెలిచింద‌ని అందరి మ‌ధ్యే కానిచ్చేశారుగా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Viral Video | ఎట్ట‌కేల‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB) జ‌ట్టు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడడంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. 18వ సీజ‌న్‌లో విజేత‌గా నిలిచి సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌దించింది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్‌సీబీకి ఆడుతూ వ‌స్తున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) మ్యాచ్ అనంత‌రం భావోద్వేగంతో క‌న్నీరు పెట్టుకున్నాడు. ఈ గెలుపు త‌న‌తో పాటు ఫ్యాన్స్‌కు ఎంతో ప్ర‌త్యేక‌మ‌ని చెప్పాడు. ఆర్‌సీబీ మాజీ ఆట‌గాళ్లు ఏబీ డివిలియ‌ర్స్‌, క్రిస్‌గేల్​తో (AB de Villiers and Chris Gayle) క‌లిసి సంబురాలు చేసుకున్నాడు.

Viral Video | ఇదేం పిచ్చి..

18 ఏళ్లుగా ఆడుతున్నా ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయిందనే.. అపవాదు ఆర్సీబీపై ఉండేది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ (Chennai Super Kings and Mumbai Indians) జట్ల అభిమానులు ఆర్సీబీ ఫ్యాన్స్‌ను (RCB fans) ఘోరంగా ట్రోల్స్ చేసేవారు. ఆర్సీబీ ఓడిపోతే చాలు.. సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ (Troll) వచ్చేవి. నిమ్మకాయలతో ఆర్సీబీ జట్టుకు దిష్టితీసినా గెలవట్లేదని.. ఇక జన్మలో ఆ జట్టు టైటిల్ సాధించదని ఇతర ఫ్రాంఛైజీల అభిమానులు ఎగతాళి చేసేవారు. కానీ ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను (Punjab Kings) 6 పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore). దీంతో కోట్లాది మంది ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

- Advertisement -

చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా.. అభిమానులు క్రాకర్లు పేల్చి, నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఓ జంట (couple) మాత్రం హ‌ద్దులు పెట్టుకొని రెచ్చిపోయింది. కిస్‌లు ఇచ్చుకుంటూ నానా ర‌చ్చ చేశారు. ప‌క్క‌న చాలా మంది తిరుగుతున్నా కూడా ఈ జంట (couple) చేసిన హంగామా మాత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియోలో అందరూ ఆర్సీబీ గెలిచిందంటూ చాలామంది రోడ్డుపై సంబరాలు జరుపుకుంటుండ‌గా, వాళ్లు అలా ముద్దుల‌లో మునిగిపోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

https://www.instagram.com/reel/DKc40itzlAG/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

- Advertisement -
- Advertisement -
Must Read
Related News