ePaper
More
    Homeక్రీడలుBanglore Stampede | ఆర్సీబీ సంబురాల్లో విషాదం.. పలువురు మృతి.. 30 మందికిపైగా గాయాలు

    Banglore Stampede | ఆర్సీబీ సంబురాల్లో విషాదం.. పలువురు మృతి.. 30 మందికిపైగా గాయాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Banglore Stampede | 17 ఏళ్ల త‌ర్వాత ఆర్సీబీ జ‌ట్టు RCB Team సంబురాలు జ‌రుపుకునేందుకు చిన్న‌స్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియం వద్దకు చేరుకోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలైనట్టు తెలుస్తోంది. అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో పోలీసులు సైతం పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. స్టేడియంలోకి ఒక్కసారిగా ఫ్యాన్స్ దూసుకురావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీఛార్జ్(Police lathicharge) చేశారు.

    Banglore Stampede | విషాదం..

    తమ అభిమాన ఆటగాళ్లు, టీమ్‌ ట్రోఫీ(Team Trophy)తో వస్తుంటే చూసి.. సంతోషించాల‌ని, వారిని అభినందించే క్ర‌మంలో స్టేడియానికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి Stadium దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట(Stampede) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

    17 సీజన్లుగా కప్పు కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసింది ఆర్సీబీ జ‌ట్టు(RCB Team). అయితే ఫైనల్‌గా 18వ సీజన్​లో తమ తొలి ఐపీఎల్‌ ట్రోఫీ(IPL Trophy) సాధించడంతో ఈ రోజు బెంగళూరులో సీఎం సిద్ధరామయ్య(Bengaluru CM Siddaramaiah) ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించే కార్యక్రమం పెట్టుకున్నారు. ముందు విధాన సౌధకు చేరుకొని.. అక్కడ సీఎంను కలిసి అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియానికి ర్యాలీగా Rallyవెళ్లాలి అనుకున్నారు. కానీ, ట్రాఫిక్, ఇత‌ర స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయ‌ని భావించి పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. చిన్న స్వామి స్టేడియంలో స‌క్సెస్ మీట్ జ‌రుపుకోవాలని సూచించారు. కానీ ఇప్పుడు ఇలా తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో అభిమానులతో పాటు ఆట‌గాళ్లు కూడా విషాదంలో మునిగిపోయారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...