అక్షరటుడే, వెబ్డెస్క్:Minister Rajanarsimha | హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి(Erragadda Mental Hospital)ని బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సందర్శించారు. ఆస్పత్రిలో మంగళవారం ఫుడ్ పాయిజన్(Food poisoning) అయి పలువురు రోగులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇందులో ఓ రోగి మృతి చెందాడు. దీంతో మంత్రి ఆస్పత్రిని తనిఖీ చేశారు.
రోగులకు అస్వస్థత ఘటనపై ఆయన ఆరా తీశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్(Hospital Superintendent)పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 74 మంది పేషంట్లు కోలుకున్నారని ఆయన తెలిపారు. 18 మందికి ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఘటనకు బాధ్యుడైన డైట్ కాంట్రాక్టర్ కాంట్రాక్టు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజల వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయి ఉద్యోగులైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.