అక్షరటుడే, వెబ్‌డెస్క్:Spying for Pak | పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని మొహాలిలో ఉన్న స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (SSOC) అధికారులు పాక్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న జస్బిర్ సింగ్ అనే యూట్యూబర్(Youtuber)ను తాజాగా అరెస్ట్ చేశారు. రూప్‌నగర్ జిల్లాలోని మహలాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్ ‘జాన్ మహల్’ అనే యూట్యూబ్ ఛానెల్(John Mahal YouTube channel) నిర్వహిస్తున్నాడు.
Spying for Pak | జ్యోతి మల్హోత్రా
జస్బీర్ సింగ్ పాకిస్తాన్(Pakistan)కు రహస్య సమాచారం చేర వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల అరెస్టయిన జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)తో జస్బీర్‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేగాకుండా భారత్‌లోని పాకిస్తాన్ హైకమిషన్ నుంచి బహిష్కరించబడిన ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్(Danish) సింగ్‌తో కూడా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
Spying for Pak | మూడు సార్లు పాక్‌కు..
జస్బీర్ సింగ్ 2020, 2021, 2024లో మూడుసార్లు పాకిస్తాన్‌కు వెళ్లి వచ్చాడని అధికారులు తెలిపారు. అయితే ఇటీవల జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత జస్బీర్ తన యూట్యూబ్ ఛానెల్లోని పాత వీడియోలను డిలీట్ చేశాడు. తన ఫోన్లోని పలు కాంటాక్ట్‌లను కూడా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. అయితే పాక్‌వెళ్లి జస్బీర్ ఏం చేశాడు.. అతని ఫోన్లో ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడని పోలీసులు(Police) ఆరా తీస్తున్నారు. నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
Spying for Pak | ఇంకెంత మంది ఉన్నారో..
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి(Terrorist Attack) చేశారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) చేపట్టి పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో దాదాపు వంద మంది ఉగ్రవాదులు మరణించారు. అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఇరుదేశాల డీజీఎంవోలు చర్చించి కాల్పుల విరణమకు అంగీకరించారు. ఈ క్రమంలో భారత నిఘా వర్గాలు దేశంలో ఉంటూ పాక్‌కు సాయం చేస్తున్న వారి ఆట కట్టిస్తున్నాయి. పాక్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న వారి వివరాలను పోలీసులకు అందిస్తుండటంతో వారు అరెస్ట్ చేస్తున్నారు.
Spying for Pak | డబ్బుల కోసం..
ఓ వైపు సైనికులు(Soldiers) తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారు. కానీ కొందరు మాత్రం డబ్బుల కోసం దేశ భద్రతను పణంగా పెడుతున్నారు. పాకిస్తాన్ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఐఎస్ఐ ఏజెంట్ల(ISI Agents)తో కుమ్మక్కై భారత రహస్యాలను వారికి చేరవేస్తున్నారు. ఇటీవల ఇలాంటి వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఇంకా ఎంతమంది ఇలాంటి వారు ఉన్నారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాక్‌కు గూఢచర్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.