అక్షరటుడే, నిజామాబాద్ సిటీ :Nizamabad | మహారాష్ట్ర(Maharashtra) నుంచి నగరానికి అక్రమంగా తరలిస్తున్న సిగరెట్లను(Cigarettes) పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం రాత్రి నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్(3 Town Police Station) పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి జీఎస్టీ చెల్లించకుండా అక్రమంగా నగరానికి తీసుకు వస్తున్న సిగరెట్లను పట్టుకున్నారు. వీటి విలువ సూమరు రూ.20 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అనంతరం కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు(commercial tax officers) అప్పగించారు. కాగా.. నిజామాబాద్‌కు నగరానికి చెందిన ఇద్దరు మార్వాడీ వ్యాపారులు మహారాష్ట్ర నుంచి తక్కువ రేట్లకు సిగరెట్లు తీసుకు వస్తున్నట్లు తెలిసింది. వీరు అక్కడి నుంచి తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.
