ePaper
More
    HomeFeaturesJune | వామ్మో జూన్​.. మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన

    June | వామ్మో జూన్​.. మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:June | జూన్​ నెల వచ్చిందంటే మధ్య తరగతి ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. జూన్​ అంటే ఖర్చుల నెల. జూన్​లోనే వానాకాలం పంటల సీజన్​ ప్రారంభం అవుతుంది. పాఠశాలలు(Schools), కాలేజీలు(colleges) పున: ప్రారంభం అవుతాయి. దీంతో జూన్​ నెలలో ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి సర్దాలో తెలియక మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

    June | ఫీజులు, బుక్కులు..

    జూన్​ 12 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పూర్తయిన వారు ఇంటర్​లో అడ్మిషన్(Inter Admission)​ పొందే సమయం కూడా ఇదే. అటు పాఠశాలల్లో కూడా ప్రవేశాలు కొనసాగుతున్నాయి. దీంతో పిల్లల స్కూల్​, కాలేజీ ఫీజులు ఈ నెలలో కట్టాల్సి ఉంటుంది. అంతేగాకుండా.. నూతన పుస్తకాలు, యూనిఫామ్స్​, షూస్​, చదువులకు కావాల్సిన ఇతర సామగ్రి కొనుగోలు చేయాలి. ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్​ బడుల్లో(private schools) చదివిస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్స్​కే దాదాపు రూ.పది వేల వరకు ఖర్చు అవుతుంది. అంతేగాకుండా ప్రస్తుతం ప్రైవేట్​ పాఠశాలల్లో ఫీజులు భారీగా ఉన్నాయి. దీంతో ఈ నెల ఎలా గడిచేది అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

    June | వానాకాలం సీజన్​ ప్రారంభం

    జూన్​ వచ్చిందంటే.. రైతులు(Farmers) వానాకాలం సాగుకు సమాయత్తం అవుతారు. పంటల సాగుకు భూములు సిద్ధం చేయడం, ఎరువులు కొట్టించడం లాంటి పనులు చేస్తారు. విత్తనాల కొనుగోలు, ఎరువుల బస్తాలు కొనుగోలు చేస్తారు. అంతేగాకుండా వరినాట్లకు కూడా డబ్బులు అవసరం అవుతాయి. దీంతో రైతుల పెట్టుబడుల కోసం అప్పులు చేస్తున్నారు.

    June | రైతు భరోసాపై స్పష్టత కరువు

    ప్రభుత్వం(Government) పంట పెట్టుబడుల కోసం రైతు భరోసా(Raithu Bharosa) కింద ఎకరాకు రూ.ఆరు వేల చొప్పున అందజేస్తోంది. అయితే యాసంగి పంటలకు సంభందించిన డబ్బులే పూర్తి స్థాయిలో అందలేదు. వానాకాలం పంటలకు డబ్బులు ఇప్పుడే వేసే అవకాశం లేదు. దీంతో అన్నదాతలు బయట అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు.

    June | మార్కెట్లు కళకళ

    జూన్​ వచ్చిందంటే.. మార్కెట్లలో సందడి నెలకొంటుంది. భారీగా నగదు లావాదేవీలు ఈ నెలలోనే జరుగుతాయి. పాఠశాలలు ప్రారంభం అవుతాయి కాబట్టి, విద్యార్థులకు(Students) కావాల్సిన బుక్స్​, ఇతర సామగ్రి కొనుగోలు చేయాలి. దీంతో స్టేషనరీ దుకాణాల్లో కాలు పెట్టే వీలు ఉండదు. యూనిఫామ్​లు, షూలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వస్త్రా దుకాణాల్లో కూడా రద్దీ అధికంగా ఉంటుంది. అలాగే విత్తనాలు, ఎరువుల దుకాణాలు కూడా రైతులతో కళకళలాడుతున్నాయి.
    మరో వైపు యాసంగిలో విక్రయించిన ధాన్యం డబ్బులు తీసుకోవడానికి రైతులు బ్యాంకుల్లో బారులు తీరుతున్నారు. దీంతో బ్యాంకుల్లో కూడా అధికంగా రద్దీ ఉంటుంది. అలాగే ఈ నెలలో పెళ్లిలు, ఇతర శుభకార్యాలు ఉండడంతో వ్యాపారాలు బాగానే జరిగే అవకాశం ఉంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...