Royal Challengers Bangalore | తొలిసారి క‌ప్ గెలుచుకున్న ఆర్సీబీ.. అవార్డులు వివ‌రాలు ఇవే..!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Royal Challengers Bangalore | ఐపీఎల్ 2025(IPL 2025)లో ఆర్సీబీ RCB జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. తొలిసారి ఐపీఎల్ గెలుచుకొని అద‌ర‌హో అనిపించింది. 18 ఏళ్ల కలను సాకారం చేసుకున్న ఆర్సీబీ తన మొదటి ఐపీఎల్ టైటిల్‌(IPL Title)ను గెలుచుకుంది. ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత ఆటగాళ్లు బీసీసీఐ(BCCI) నుంచి అనేక అవార్డులను అందుకున్నారు. సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్‌(Sai Sudarshan Orange Cap)ను కైవసం చేసుకోగా.. గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్‌(Prasiddh Krishna Purple Cap)ను గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత అందించిన అవార్డుల గురించి ఓ లుక్కేస్తే..

Royal Challengers Bangalore | అవార్డుల జాబితా..

ఈ సీజన్‌లో సాయి సుదర్శన్ 759 పరుగులు చేశాడు. దీంతో అత‌నికి ఆరెంజ్ క్యాప్ ద‌క్కింది. ఇక గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ మొత్తం 25 వికెట్లు తీశాడు. దీని తర్వాత మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) మోస్ట్ ఎకనామికల్ డాట్ బాల్ అవార్డును గెలుచుకున్నాడు. అదే సమయంలో సీఎస్కే ఫెయిర్ ప్లే అవార్డును గెలుచుకుంది. సూర్యకుమార్ యాదవ్ మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్ టైటిల్ ద‌క్కించుకున్నాడు. దీంతో పాటు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(DDCA) ఉత్తమ పిచ్, గ్రౌండ్‌ను సిద్ధం చేసినందుకు అవార్డును గెలుచుకుంది. ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ఆర్సీబీ రూ.20కోట్ల ప్రైజ్ మనీని అందుకోగా.. ఓడిపోయిన జట్టు పంజాబ్‌కు రూ.12.50 కోట్లు దక్కాయి.

ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు వీరే..

  • ఐపీఎల్ 2025 ఛాంపియన్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)
  • ఐపీఎల్ 2025 రన్నరప్ – పంజాబ్ కింగ్స్(PBKS)
  • ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ – కృనాల్ పాండ్యా(RCB)
  • ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – సాయి సుదర్శన్(GT)
  • సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్-వైభవ్ సూర్యవంశీ(RR)
  • ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్- సాయి సుదర్శన్(GT)
  • పర్పుల్ క్యాప్(25 వికెట్లు) -ప్రసిద్ధ్ కృష్ణ(GT)
  • ఆరెంజ్ క్యాప్(759) – సాయి సుదర్శన్(GT)
  • సీజన్‌లో అత్యధిక సిక్సర్లు -నికోలస్ పూరన్(LSG)
  • సీజన్‌లో అత్యధిక ఫోర్లు – సాయి సుదర్శన్(GT)
  • సీజన్‌లో అత్యధిక డాట్ బాల్స్ – మహమ్మద్ సిరాజ్(GT)
  • సీజన్‌లో బెస్ట్ క్యాచ్ – కమిందు మెండిస్(SRH)
  • ఫెయిర్ ప్లే అవార్డు – చెన్నై సూపర్ కింగ్స్(CSK)
  • అత్యంత విలువైన ఆటగాడు(MVP) – సూర్యకుమార్ యాదవ్ (MI)