- Advertisement -
Homeక్రీడలుrcb won Ipl trophy | ఈ సాలా క‌ప్ న‌మ్డే 18 ఏళ్ల త‌ర్వాత...

rcb won Ipl trophy | ఈ సాలా క‌ప్ న‌మ్డే 18 ఏళ్ల త‌ర్వాత ఆర్సీబీ ఖాతాలో ఐపీఎల్ క‌ప్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: rcb won ipl trophy : ఐపీఎల్ 2025 ఫైనల్‌(IPL 2025 final)లో ఆర్సీబీ ఘ‌న విజ‌యం సాధించి చ‌రిత్ర సృష్టించింది. 18 ఏళ్లుగా ఈ క‌ప్ కోసం ఆర్సీబీ(RCB) ఎంతో క‌ష్ట‌ప‌డింది. కానీ చివ‌రిగా కప్ సాధించింది. క‌ప్ ద‌క్కుతుంద‌న్న సంతోషంతో విరాట్ ఎమోష‌న‌ల్ కూడా అయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)కు బ్యాటింగ్ అప్పగించాడు. పిచ్ పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్న అత‌ను 200 స్కోరు లోపు క‌ట్ట‌డి అయ్యేలా చేశాడు. 20 ఓవ‌ర్స్‌లో ఆర్సీబీ 190 ప‌రుగులు చేయ‌గా, ఈ టార్గెట్‌ని పంజాబ్ ఈజీగా చేజ్ చేస్తుంద‌ని అంద‌రు అనుకున్నారు. కానీ లెక్క‌లు తారుమారయ్యాయి. ఆర్సీబీ బౌల‌ర్స్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో పంజాబ్ క‌న్న క‌ల‌లు క‌ల‌గానే మిగిలిపోయాయి. ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. అత్యంత కీలక వికెట్ కోల్పోయింది. పంజాబ్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Punjab captain, star batter Shreyas) ఔట్ అయ్యాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేసి అయ్యర్ ఔటయ్యాడు. బెంగళూరు బౌలర్ రొమారియో షెపర్డ్(Bangalore bowler Romario Shepherd) అద్భుతమైన బంతితో అయ్యర్ ను పెవిలియన్ కు పంపాడు.

rcb won ipl trophy : క‌ల నిజ‌మైంది..

ఒక పరుగు మాత్రమే చేసి అయ్యర్ ఔట్ కావడంతో పంజాబ్ ఫ్యాన్స్ షాక్ తిన్నారు. 9.4 ఓవర్లలో 79 పరుగుల స్కోర్ వద్ద పంజాబ్ తన మూడో వికెట్ ను కోల్పోయింది. ఆ త‌ర్వాత ఎవ‌రు కూడా చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌క‌పోవ‌డంతో పంజాబ్ జ‌ట్టు ఓట‌మి చెందింది. అయ్య‌ర్ వికెట్‌తో మ్యాచ్‌ను మ‌లుపు తిప్పాడు షెప‌ర్డ్. అయితే.. జోష్ ఇంగ్లిస్(39) మాత్రం భారీ సిక్సర్ల‌తో విరుచుకుప‌డుతుండ‌గా, ఆయ‌న‌ను బురిడి కొట్టించాడు పాండ్యా. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన వ‌దేరా(15 ), శ‌శాంక్ ( 26), స్టోయినిస్ (6) ప‌రుగులు చేయ‌డంతో పంజాబ్ జ‌ట్టు లక్ష్యాన్ని చేధించేందుకు చాలా క‌ష్ట‌ప‌డింది. ఈ క్ర‌మంలో ఆర్సీబీపై 6 ప‌రుగుల తేడాతో అప‌జ‌యం సాధించింది పంజాబ్.

- Advertisement -

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025కి ముందు మూడు ఐపీఎల్ ఫైనల్స్ ఆడింది. 2009, 2011, 2016లో ఆ జట్టు ఫైనల్ చేరింది. అయితే ఈ మూడు మ్యాచ్‌లలోనూ ఆర్సీబీ పరాజయం పాలైంది. కానీ ఈసారి మాత్రం ఫస్టు బ్యాటింగ్ చేసి ఎట్ట‌కేల‌కి 18 ఏళ్ల త‌ర్వాత క‌ప్ ద‌క్కించుకుంది. కోహ్లీ డ్రీమ్ నెర‌వేరింది. గ‌త కొన్నాళ్లుగా ఈ క‌ప్ కోసం ఎంతో ట్రై చేసిన ఇది అంద‌ని ద్రాక్ష మాదిరిగానే మారింది. ఎట్ట‌కేల‌కు 18 సంవ‌త్స‌రాల ఐపీఎల్ చరిత్ర‌లో తొలిసారి ఆర్సీబీ క‌ప్ అందుకుంది. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే 18 ఏళ్ల త‌ర్వాత ఆర్సీబీకి క‌ప్ ద‌క్క‌డం, విరాట్ జెర్సీ నెంబ‌ర్ 18 కావ‌డం విశేషం. ఇక ఆర్సీబీ బౌల‌ర్స్ అద్భుతంగా బౌల్ చేసి క‌ట్ట‌డి చేశారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా నాలుగు ఓవర్స్ వేసి రెండు వికెట్స్ తీసి 17 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News