ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం కీలక సూచనలు

    CM Revanth Reddy | వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం కీలక సూచనలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ (Hyderabad) నగరంలో వర్షాలు, వరదలు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌ (Traffic)తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీసు, ట్రాఫిక్, హైడ్రా(Hydraa), జీహెచ్ఎంసీ(GHMC) విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాకాల (Rainy Season) సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

    CM Revanth Reddy | చర్యలు చేపట్టాలి

    అవసరానికి అనుగుణంగా 24 గంటల పాటు ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. జంట నగరాల్లో గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనులకు సంబంధించిన పురోగతిని తెలుసుకున్నారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

    ఔటర్ రింగ్ రోడ్డు(ORR) లోపల కోర్ అర్బన్ రీజియన్‌లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ ప్రాంతంలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక పాలసీని తయారు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

    More like this

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...

    IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది....