అక్షరటుడే, ఇందూరు: TSUTF | ప్రభుత్వ బడిలో చేర్పించి.. ఫీజుల భారాన్ని తగ్గించుకోవాలని డీఈవో అశోక్ (DEO Ashok) అన్నారు. మంగళ వారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో (Telangana State United Teachers Federation) చేపట్టిన బడి బాట ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్, జిల్లా అధ్యక్షుడు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, సాయన్న, భాజన్న, లింగం తదితరులు పాల్గొన్నారు