ePaper
More
    HomeజాతీయంRahul Gandhi | లొంగిపోవడం వారికి అలవాటే.. రాహుల్​ గాంధీ సంచలన వ్యాఖ్యలు

    Rahul Gandhi | లొంగిపోవడం వారికి అలవాటే.. రాహుల్​ గాంధీ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | లోక్​సభ ప్రతిపక్షనేత రాహుల్​గాంధీ (Rahul Gandhi) మరోసారి ఆపరేషన్​ సిందూర్ (Operation Sindoor)​పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

    బుధవారం ఆయన మధ్యప్రదేశ్​లోని భోపాల్ (Bhopal)​లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (US President Trump)​ బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడ్డారని ఆరోపించారు. ట్రంప్‌ ఫోన్‌ బెదిరింపులకు మోడీ లొంగిపోయారన్నారు. ‘‘ఆపరేషన్‌ ప్రారంభం కాగానే ట్రంప్‌ ఫోన్‌ చేశారు. నరేందర్‌.. సరెండర్‌ అనగానే.. జీ హుజూర్‌’’ అన్నారని విమర్శించారు.

    సరెండర్‌ కావడం బీజేపీ(BJP), ఆర్​ఎస్ఎస్ (RSS)​కు అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్​ భయంతోనే మోదీ పాకిస్తాన్ (Pakistan)​తో కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించారని రాహుల్​ గాంధీ ఆరోపించారు.

    1971లో పాకిస్తాన్​తో యుద్ధ సమయంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) ఎవరికి భయపడలేదని ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీ​ గతంలో సైతం ఆపరేషన్​ సిందూర్​పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. భారత్ ఎన్ని జెట్లు కోల్పోయిందో చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. అలాగే ఆపరేషన్​ గురించి పాకిస్తాన్​కు కేంద్రం ముందుగా సమాచారం ఇచ్చిందని ఆయన ఆరోపించారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...