- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిIndiramma Housing Scheme | నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Indiramma Housing Scheme | నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Indiramma Housing Scheme | నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (MLA Pocharam Srinivasa Reddy) అన్నారు. వర్ని మండల కేంద్రంలోని సీసీడీ ఫంక్షన్​హాల్​లో వర్ని, చందూర్, మోస్రా, రుద్రుర్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 803 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశామన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా అందించనున్నట్లు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ కాసుల బాలరాజు, వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News