అక్షరటుడే, ఇందూరు : Registration | సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ (registration process) అంటే రోజంతా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. ఒక్కో రోజు అధికంగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. అంతేగాకుండా పలువురు అధికారులు దళారులను కలవకుండా నేరుగా వెళ్లిన ప్రజల డాక్యుమెంట్లను రిజిస్టర్ చేసేవారు కాదు. ఈ క్రమంలో పారదర్శకతతో పాటు వేగంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ప్రభుత్వం (government) చర్యలు చేపట్టింది.
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (Sub-registrar office) స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ 2 నుంచి అమలులోకి తీసుకు వచ్చింది. దీంతో ప్రజలకు రిజిస్ట్రేషన్ కోసం పడిగాపులు కాయాల్సిన బాధలు తప్పనున్నాయి. నూతనంగా ప్రవేశ పెట్టిన విధానంలో అరగంటలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ (registration process) పూర్తవుతోంది. డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసుకోవాల్సిన వారు కూడా స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి వస్తే సరిపోతుంది. దీంతో కార్యాలయంలో రద్దీ తగ్గడంటో పాటు ప్రజలకు సమయం ఆదా అవుతుంది.
Registration | అక్కడ విజయవంతం కావడంతో..
స్లాట్ బుకింగ్ విధానాన్ని (slot booking system) మొదట ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేశారు. అందులో జిల్లాలోని ఆర్మూర్ కూడా ఉంది. అక్కడ ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Registration | ఉమ్మడి జిల్లాలో పది కార్యాయాలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (joint Nizamabad district) మొత్తం 10 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ విధానం ((slot booking system) ప్రకారం.. ఆఫీస్ పని వేళలను 48 స్లాట్లుగా విభజించారు. ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఆయా రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. వారు ఏ సమయానికైతే నమోదు చేసుకుంటారో అప్పుడే వస్తే సరిపోతుంది. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా కావడంతో పాటు పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
Registration | అరగంటలో పూర్తి

- మురళీధర్, నిజామాబాద్
మేము మా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చాం. గతంలో ఒక రోజంతా ఇక్కడే ఉండేవాళ్లం. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ విధానం బాగుంది. ఈ రోజు కేవలం అరగంటలో మా పని పూర్తి చేసుకుని వెళ్తున్నాం.
Registration | స్లాట్ సమయానికి వస్తే సరిపోతుంది

- రవికాంత్, సబ్ రిజిస్ట్రార్
ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ విధానాన్ని ప్రారంభించాం. రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు తాము నమోదు చేసుకున్న సమయానికి వస్తే సరిపోతుంది. వేచి ఉండే పని లేదు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.