ePaper
More
    HomeతెలంగాణCP Sai Chaitanya | ఘరానా దొంగల ముఠా అరెస్ట్

    CP Sai Chaitanya | ఘరానా దొంగల ముఠా అరెస్ట్

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్​ కమిషనరేట్​ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య మంగళవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఆరో టౌన్ పోలీస్​స్టేషన్​ పరిధిలో వరుస చోరీ కేసులు నమోదయ్యాయి. ఈ దొంగతనాలను పోలీస్​ శాఖ సీరియస్​గా తీసుకుంది. ఏసీపీ రాజా వెంకట్​రెడ్డి (ACP Raja Venkat reddy) ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి హైదరాబాద్​కు (Hyderabad) చెందిన మహమ్మద్​ అమీర్​గా గుర్తించారు. అతడిని పట్టుకుని విచారించగా ముఠా గుట్టురట్టయ్యింది. మొత్తం 11 మంది ముఠాలో ఉండగా.. 8 మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

    CP Sai Chaitanya | చిన్నచిన్న చోరీలతో మొదలై..

    ముఠాలో ముఖ్యుడైన మహమ్మద్​ అమీర్​​ తొలుత చిన్నచిన్న చోరీలు చేసేవాడు. ఈ క్రమంలో ధర్మపురి హిల్స్​కు చెందిన మహమ్మద్​ అబ్దుల్​ ఆసిఫ్​తో పరిచయం ఏర్పడింది. ఆసిఫ్​ తనకు పరిచయమున్న వసీం, సోహైల్, జావిద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్​లను అమీర్​కు పరిచయం చేశాడు. వీరంతా కలిసి నగరలో పలు చోరీలకు పాల్పడ్డారు.

    CP Sai Chaitanya | వీరంతా పాత నేరస్తులే..

    జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా సభ్యులంతా గతంలో నేరాలకు పాల్పడిన వారే. నగరంలోని ఐదో టౌన్, ఆరో టౌన్, రుద్రూర్ పోలీస్ స్టేషన్, ఆటోనగర్ (Auto Nagar), ధర్మపురి హిల్స్ (Dharmapuri Hills), పెయింటర్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ అక్బర్ కాలనీ, శాంతినగర్ కాలనీలలో సుమారు 24కు పైగా ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి వారు ఒప్పుకున్నారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను వారికి పరిచయం ఉన్న మల్కాపూర్​కు చెందిన మోహన్ అనే వ్యక్తికి అమ్మేవారు. వీరందరిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

    వీరి వద్ద నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, స్విఫ్ట్ డిజైర్ కారు, మూడు బైక్​లు స్వాధీనం చేసుకున్నారు. వీరితోపాటు చోరీలకు పాల్పడిన ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్(South Rural CI Suresh Kumar), ఆరో టౌన్ ఇన్​స్పెక్టర్​ వెంకట్రావు, హెడ్ కానిస్టేబుల్ కర్బాజీ, కానిస్టేబుల్ అభిలాష్, సునీల్ కుమార్, శివ సాగర్ గౌడ్, రవి కిరణ్​లను పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేశారు.

    More like this

    Ex Mla Jajala Surendar | రైతులను ఆదుకోకుంటే బీసీ సభను అడ్డుకుంటాం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex Mla Jajala Surendar | ఇటీవలి భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని...

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...

    Kamareddy | గొర్ల మందను ఢీకొన్న లారీ.. గొర్ల కాపరితో సహా 30 గొర్లు మృతి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30...