అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kamal Haasan | విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం(Thug Life movie) జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు కమల్ లేనిపోని వివాదంలో చిక్కుకున్నాడు. కన్నడ భాషను ఉద్దేశిస్తూ సీనియర్ నటుడు కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కమల్ (Kamal Hassan) క్షమాపణలు చెప్పనని మొండిపట్టడంతో, ‘థగ్ లైఫ్’ సినిమాను బ్యాన్ చేయనున్నట్లు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(కేఎఫ్సీసీ) ప్రకటించింది. సినిమాకు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా చూసేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టు(Karnataka High Court)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కమల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Kamal Haasan | క్షమాపణ చెబితే చాలు కదా..
విచారణ సందర్భంగా కమల్‌పై కోర్టు(High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘క్షమాపణలు చెప్పకుండా కోర్టుకు వచ్చారా..?’ అంటూ తీవ్రంగా మండిపడింది. ‘మీరు కమల్ హాసన్(Kamal Hassan) కావొచ్చు.. ఎంత పెద్ద నటుడైనా కావొచ్చు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు మీకు లేదు. ఒక ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదు. మీ కామెంట్స్ వల్ల అశాంతి ఏర్పడింది. నీరు, భూమి, భాష.. ఇవి ప్రజలకు ముఖ్యమైనవి. ఈ దేశ విభజన భాషా ప్రాతిపదికన జరిగింది. ఏ భాష మరొక భాష నుంచి పుట్టదు. మీ వ్యాఖ్యలతో కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. మీరేమైనా చరిత్రకారులా? లేక భాషావేత్తనా..? ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు..? కన్నడ ప్రజలు మిమ్మల్ని ఏమి అడిగారు..? కేవలం క్షమాపణలే కదా. ఈ వ్యవహారంలో ఒక్క క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది కదా అని న్యాయమూర్తి(Judge) అన్నారు.
కర్నాటక ప్రజల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం లేదనుకుంటే కోట్ల రూపాయల ఆదాయాన్ని మర్చిపోవాలి’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గతంలో సి.రాజగోపాలాచారి ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు క్షమాపణలు Sorry చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. కమల్‌హాసన్ తీరుతో శివరాజ్‌కుమార్(Shivarajkumar) కూడా ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు తెలిపింది. భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం తగదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.