అక్షరటుడే, ఇందూరు: Yoga Walk | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని డీఎంహెచ్వో రాజశ్రీ (DMHO Rajshri) అన్నారు. యోగా అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ (Nizamabad Yoga of Association), ఆయుష్ శాఖ (AYUSH) సంయుక్త ఆధ్వర్యంలో యెగా వాక్ నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం నగరంలోని పాలిటెక్నిక్ మైదానం (Polytechnic Ground) నుంచి పాత కలెక్టరేట్ మైదానం వరకు వాక్ జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడారు. అనంతరం విద్యార్థులు యోగాసనాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో యోగా అసోసియేషన్ ప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ, ఆయుష్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
