Womens World Cup
Womens ODI World Cup 2025 | వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 షెడ్యూల్ వ‌చ్చేసింది.. పాకిస్తాన్ ఆడుతుందా?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Womens ODI World Cup 2025 | భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న మహిళల వన్డే(Women’s ODI) ఎప్పుడు మొదల‌వుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న నేప‌థ్యంలో ప్రపంచ కప్ తేదీలు, వేదికలను ఐసీసీ ప్రకటించింది. ఈ గ్లోబల్ టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ODI world cup నవంబర్ 2న జరగనుంది. ఈ మ్యాచ్‌లు భారత్, శ్రీలంకలోని ఐదు నగరాల్లో ఈ టోర్నీ జ‌ర‌గ‌నుండ‌గా, బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం, గౌహతిలోని ఏసీఏ స్టేడియం, ఇండోర్‌లోని హోల్కర్ స్డేడియం, విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం, కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి.

Womens ODI World Cup 2025 | పాక్ ఎక్క‌డ ఆడుతుంది..

ఇండియాతో పాటు శ్రీలంక Srilanka సంయుక్తంగా ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board)తో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌ జట్టు ఆడే మ్యాచులకు శ్రీలంక ఆతిథ్యం ఇస్తుంది. మిగిలిన 7 జట్లు కూడా ఇండియాలోని నాలుగు నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచులు(World Cup matches) ఆడతాయి. రాజకీయ కారణాల వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, పాకిస్తాన్ జట్టు భారత్‌కు వ‌చ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ పాకిస్తాన్ జట్టు సెమీ-ఫైనల్స్ లేదా ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఆ మ్యాచ్‌లు కూడా కొలంబోలోనే జరుగుతాయి. మిగిలిన సెమీ-ఫైనల్ బెంగళూరులో, ఫైనల్ కూడా బెంగళూరులో జరుగుతుంది.

ఈ విధానాన్ని “హైబ్రిడ్ మోడల్”గా Hybrid model పిలుస్తారు. ఇది 2024-2027 కాలంలో ఇరు దేశాలు ఆతిథ్యం ఇచ్చే ఐసీసీ ఈవెంట్‌లలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లకు వర్తిస్తుంది. గతంలో పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడినట్లుగానే, ఇప్పుడు పాకిస్తాన్ మహిళల జట్టు శ్రీలంక(Sri Lanka)లో ఆడుతుంది. ఈ టోర్నీలో మొత్తంగా 8 జట్లు పాల్గొంటాయి. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ టైటిల్ ఫైట్ జరుగుతుంది. 2022 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ని ఓడించిన ఆస్ట్రేలియా, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 2025 వన్డే వరల్డ్ కప్ ఆడనుంది.. అలాగే ఇంగ్లాండ్‌లో జరగబోయే 2026 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ షెడ్యూల్ కూడా ప్రకటించింది ఐసీసీ. జూన్ 12న బర్మింగ్‌హమ్‌లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. జూన్ 30, జూలై 2 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచులు, జూలై 5న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.