ePaper
More
    Homeక్రైంCanara Bank | కెన‌రా బ్యాంక్‌లో భారీ చోరీ.. ఏకంగా 59 కిలోల బంగారం

    Canara Bank | కెన‌రా బ్యాంక్‌లో భారీ చోరీ.. ఏకంగా 59 కిలోల బంగారం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Canara Bank | క‌ర్ణాటకలోని Karnataka విజయపుర జిల్లాలో ఓ భారీ చోరీ వెలుగులోకి వ‌చ్చింది. మంగోలి ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంక్ Canara Bank శాఖను లక్ష్యంగా చేసుకున్న దొంగలు, 59 కిలోల బంగారు ఆభరణాలు అపహరించిన‌ట్టు తెలిసింది. ఇది జ‌రిగి నాలుగు ఐదు రోజులు అవుతున్నా ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మేట‌ర్‌లోకి వెళితే మే 24, 25 తేదీలు వారాంతపు సెలవులు కావడంతో మంగోలి కెనరా బ్యాంకు శాఖ(Mongoli Canara Bank Branch)ను మూసివేశారు. మే 23వ తేదీ సాయంత్రం సిబ్బంది బ్యాంకును భద్రంగా మూసి ఇంటికి వెళ్లారు. తిరిగి మే 26వ తేదీన బ్యాంకు తెరిచేందుకు వచ్చిన ప్యూన్, బ్యాంకు షట్టర్ తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి అవాక్క‌య్యారు.

    Canara Bank | భారీ చోరీ..

    షట్టర్ తాళం కట్ చేయబడినట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు(Police) సంఘటనా స్థలాన్ని పరిశీలించగా, దొంగలు లోపల చొరబడినట్లు స్పష్టమైంది. బ్యాంక్ నుంచి 59 కిలోల బంగారం మాయమైందని అధికారుల ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాంకు లోపలికి దొంగలు Thiefs ఇలా ప్రవేశించడం, తాకట్టు పెట్టిన ఆభరణాలే చోరీకి గురవడం గమనార్హం. విజయపుర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మణ్ బి.నింబర్గి ఈ దోపిడీని ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ “తనిఖీ చేసిన తర్వాత, దొంగలు బ్యాంకులోకి చొరబడి దోపిడీకి పాల్పడినట్లు తేలింది. బ్యాంకు అధికారులు దోచుకున్న సొత్తును అంచనా వేయగా 59 కిలోల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు అని తెలిపారు. ఈ బంగారం విలువ కోట్ల రూపాయలలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఇటీవల జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీలలో ఒకటిగా పోలీసులు భావిస్తున్నారు.

    మే 24, 25 తేదీల మధ్య రాత్రి సమయంలో ఈ దోపిడీ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీకి గురైన బంగారం(Gold) బ్యాంకు సొంత ఆస్తి కాదని, వినియోగదారులు బంగారు రుణాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆభరణాలని ఎస్పీ నింబర్గి(SP Nimbargi) పేర్కొన్నారు. ఈ కేసు స్థానికంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దృష్టిని ఆకర్షించింది. బ్యాంకు భద్రతపై పెద్ద చర్చ నడుస్తోంది. అనుమానితులను విచారించడంతో పాటు బ్యాంకు Bank పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ, బ్యాంకు మూసి ఉన్న రోజుల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దోషులను త్వరగా పట్టుకుని, చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

    Latest articles

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతోంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    More like this