Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత
Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission office) వద్ద ఉద్రిక్తత నెలకొంది. పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో పాక్​ ఎంబసీ అధికారులు కేక్​ కట్​ చేసుకొని సంబరాలు చేసుకున్నట్లు వార్తలు రావడంతో ప్రజలు భారీగా అక్కడికి చేరుకున్నారు. కశ్మీర్‌ Kashmirలో ఉగ్రమూకలు సృష్టించిన ఘటన యావత్‌ ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనలో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశం దిగ్భ్రాంతిలో ఉన్నవేళ పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయంలోనికి ఓ సిబ్బంది కేక్‌ cake తీసుకెళ్లాడు. దీంతో ఉగ్రదాడిపై కార్యాలయంలో కేక్​ కట్ చేసి సంబరాలు చేసుకున్నట్లు వార్తలు ప్రచారం కావడంతో ప్రజలు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. పాకిస్తాన్​ pakistanకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు భారీ కేడ్లు అడ్డుపెట్టి ఆందోళనకారులు లోనికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజలు అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.