ePaper
More
    HomeజాతీయంIRS officer's illegal assets | ఐఆర్​ఎస్​ అధికారి భారీ అక్రమాస్తుల చిట్టా​.. రూ.కోట్లలో నగదు,...

    IRS officer’s illegal assets | ఐఆర్​ఎస్​ అధికారి భారీ అక్రమాస్తుల చిట్టా​.. రూ.కోట్లలో నగదు, భారీగా బంగారం

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: IRS officer’s illegal assets : 2007 బ్యాచ్‌కు చెందిన సీనియర్ IRS (ఇన్‌కమ్ ట్యాక్స్) అధికారి senior IRS (Income Tax) officer ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (Central Bureau of Investigation – CBI) సోదాలు చేపట్టి, భారీ మొత్తంలో అక్రమ ఆస్తులను వెలికితీసింది.

    ప్రస్తుతం ఢిల్లీ(Delhi) ITO, CR బిల్డింగ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ (Directorate of Taxpayer Services)లో అదనపు డైరెక్టర్ జనరల్ (Additional Director General)గా పనిచేస్తున్న ఈ అధికారి సహా మరో వ్యక్తిని CBI ఇప్పటికే అరెస్టు చేసింది. కాగా.. అధికారి పేరు, వివరాలు మాత్రం బయటపెట్టలేదు.

    ఢిల్లీ, ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని పలు ప్రదేశాల్లో ఈ దాడులు సమాంతరంగా జరిగాయి. అధికారి నివాసాలు, బంధువుల ఇళ్ళు, కార్యాలయాల వంటి ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. అవినీతి కొండ నుంచి 3.5 కేజీల గోల్డ్, 2 కేజీల సిల్వర్, రూ.కోటి నగదుతో పాటు ఇతర కీలకమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాల (లాప్‌టాప్‌లు, మొబైల్స్)ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

    CBIకి అందిన ఫిర్యాదు నేపథ్యంలో సోదాలు చేపట్టగా.. పన్ను సంబంధిత సేవలకు సంబంధించి లంచాల డిమాండ్, అవినీతి ఆధారాలు లభించాయి. ఈ క్రమంలోనే ఈ ఇద్దరినీ అరెస్టు చేసి, వారి సంబంధిత ప్రదేశాల్లో దాడులు చేపట్టారు. సోదాల్లో అధికారి వద్ద ఈ స్థాయిలో నగదు, విలువైన వస్తువులు బయటపడటం అందరినీ షాక్‌కు గురిచేసింది.

    సీబీఐ ఇప్పటికే అరెస్టు అయిన ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరనుంది. మొత్తం ఆస్తులు, అక్రమ లావాదేవీల ట్రేసింగ్ కోసం బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల పత్రాలు తదితర ఆధారాలు సేకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

    ఈ ఘటన అవినీతి నిరోధక శక్తులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించేలా చేసింది. ఆదాయపన్ను శాఖలో ఉన్నతస్థాయి అధికారిపై ఈ స్థాయిలో చర్యలు తీసుకోవడం గతంలో లేనట్లుగా తెలుస్తోంది. CBI మరింత లోతుగా విచారణ చేపట్టి మరిన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...