అక్షరటుడే, వెబ్‌డెస్క్: Heinrich Klaasen | ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ మ్యాక్స్ వెల్ ఈ రోజు ఉదయం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ తీసుకున్నట్టు ప్రకటించాడు. అనంతరం కొద్ది నిమిషాలలో సౌతాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen).. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. దక్షిణాఫ్రికా జట్టుకు వికెట్ కీపర్, బ్యాటర్‌గా రాణించిన అతను ఇలా సడెన్‌గా తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్.. అతన్ని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్(International cricket) నుంచి దూరం కావాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ క్రికెట్‌కి దూరం అవుతున్న విషయాన్ని క్లాసెన్ వెల్లడించాడు.
Heinrich Klaasen | ఎందుకిలా..
దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించడం తన కల అని చెప్పాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఎంతో గౌరవంగా భావించినట్లు చెప్పుకొచ్చాడు. ఇక తన కుటుంబంతో మరింత సమయం గడపవచ్చని అన్నాడు. 2024 జనవరిలో అతను టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. దక్షిణాఫ్రికా తరపున నాలుగు టెస్టులు, 60 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు అతను ఆడాడు. తన కుటుంబం గురించి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన క్లాసెన్.. ఇప్పుడు టీ 20, వన్డేలకు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్(Official Announcement) చేశాడు. అతడు 33 ఏళ్ల వయసులో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇక క్లాసెన్‌ను మనం లీగ్‌లలో మాత్రమే చూసే అవకాశం దక్కుతుంది.
టీ20 క్రికెట్‌లో క్లాసెన్ విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే టీ20 కెరీర్‌ను పొడిగించాలని కొందరు కోరుతున్నారు. రిటైర్‌మెంట్(Retirement) గురించి తన సోషల్ మీడియా ద్వారా రాసుకొచ్చిన క్లాసన్ దేశానికి ప్రాతినిథ్యం వహించాలనేది నా చిన్ననాటి కల. ఆ అవకాశం లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ప్రోటీస్ తరపున ఆడడం వల్ల నా జీవితాన్ని మార్చిన గొప్ప వ్యక్తులను కలిసే అవకాశం దక్కింది. గొప్ప స్నేహాలు పొందాను. నాకు సహకరించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, కోచ్‌లకు కృతజ్ఞతలు. నా ఛాతీపై ప్రోటీస్ బ్యాడ్జ్‌తో ఆడడం నా కెరీర్‌లో అతిపెద్ద గౌరవంగా భావిస్తున్నాను. నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఈ నిర్ణయం నాకు అలా చేయడానికి వీలు కల్పిస్తుంది అని హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen) రాసుకొచ్చాడు.