ePaper
More
    HomeజాతీయంRBI | రూ.రెండు వేల నోట్ల‌పై ఆర్బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఇంకా ప్రజల దగ్గరే 6...

    RBI | రూ.రెండు వేల నోట్ల‌పై ఆర్బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఇంకా ప్రజల దగ్గరే 6 వేల కోట్ల రూపాయలు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank of India).. 2023 మే నెలలో రూ.2 వేల నోట్ల(Rs. 2 thousand notes) చలామణిని ఉప‌సంహ‌రించుకున్న విషయం తెలిసిందే. ఎవ‌రి ద‌గ్గ‌రైనా రూ.రెండు వేల నోట్లు ఉంటే వెనక్కి ఇవ్వాలని.. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో Post Office ఎక్స్చేంజ్ చేసుకోవడం లేదా డిపాజిట్ చేయడం చేయాలని పేర్కొంది. అయితే ఇప్పటికీ రూ.6,181 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయి. ఈ నోట్లు రద్దయ్యాయా లేదా అనే సందేహం ఇంకా చాలామందిలో ఉంది. దానికి ఆర్‌బీఐ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. నోట్ల రద్దు తర్వాత రిజర్వ్‌ బ్యాంక్‌ 2016 నవంబర్ 8న రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బ్లాక్ మనీ, అవినీతి, నకిలీ కరెన్సీకి బ్రేకులు వేసేందుకు కేంద్ర నోట్లను రద్దు చేసింది.

    RBI | మ‌రో ఛాన్స్..

    నోట్ల రద్దుతో వచ్చే కరెన్సీ(Currency)ని కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం రూ.2వేల నోట్లను తీసుకువచ్చింది. మహాత్మా గాంధీ సిరీస్ నోట్లలో భాగంగా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో నోట్లను Notes విడుదల చేసింది. 2023లో వీటి రద్దు నిర్ణయం ప్రకటించినప్పుడు మొత్తం రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆ తర్వాత 2025 మే 31 నాటికి ఈ మొత్తం గణనీయంగా తగ్గి కేవలం రూ. 6,181 కోట్లకు చేరింది. అంటే, 98.26% నోట్లు మాత్రమే ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి చేరాయి. మిగిలిన రూ. ఆరు వేల కోట్లు ఇంకా ప్రజల వద్దనే ఉన్నాయి. మిగిలిన రూ. 2వేల నోట్లను సాధారణ బ్యాంక్ బ్రాంచ్‌లలో డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం 2023 అక్టోబర్ 7తో ముగిసింది.

    అయితే, ఆర్‌బీఐ ఆఫీసుల్లో ఈ నోట్లను మార్చుకుని తమ అకౌంట్లల్లో డిపాజిట్ Deposit చేసుకునే అవకాశం ఇప్పటికీ అవకాశం ఉందని.. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కేంద్ర కార్యాలయాల్లో(RBI central offices) ఈ సదుపాయం అందుబాటులో ఉందని చెప్పింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను పోస్టాఫీసుల్లోనూ మార్చుకోవచ్చని చెప్పింది. కొంతమంది మరిచిపోయి ఉండవచ్చు. మరికొంత మందికి సమాచారం తెలియకపోవచ్చు. ఇంకొందరు ఈ నోట్లు వ్యక్తిగతంగా నిల్వ చేసుకుని ఉండవచ్చు. కారణం ఏదైనా సరే, RBI ఇప్పటికీ వాటిని తీసుకునేందుకు అవకాశం ఇస్తోంది. కాబట్టి వాటిని వీలైనంత త్వరగా మార్చుకోండి.

    More like this

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...