అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మొదట ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ (Eravatri Anil) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanuman), నిజామాబాద్ సీపీ సాయిచైతన్య (cp sai Chaitanya), అదనపు కలెక్టర్ కిరణ్ తదితరులు హాజరయ్యారు.
CP Sai Chaitanya | ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాలు..
కార్యక్రమంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యం చేసిన శివుడి పాటకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) లయబద్ధంగా స్వరం కలిపారు. తానూ స్వరం కలిపి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.