- Advertisement -
HomeUncategorizedJackie Chan | జాకీచాన్ తండ్రి గూఢ‌చారినా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి..!

Jackie Chan | జాకీచాన్ తండ్రి గూఢ‌చారినా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jackie Chan | ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాక్షన్‌ ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేని పేరు ఏదంటే జాకీ చాన్ అని ఠ‌క్కున చెబుతారు.. మార్షల్‌ ఆర్ట్స్‌(Martial Arts)లో ధీరుడైన ఈయన తనదైన యాక్షన్‌తో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా 90ల నాటి పిల్లలైతే, ఆయన సినిమాలు చూస్తూనే పెరిగారు. ఆయ‌న తన కెరీర్​లో నిర్మాతగా, నటుడిగా నిరూపించుకున్నారు. అప్పట్లో తెలుగులో పలు ఛానళ్లలో జాకీచాన్(Jackie Chan) డబ్బింగ్ మూవీలు రాగా.. వాటికి విపరీతమైన ఆదరణ లభించింది. ఇక శని, ఆది, వేసవి సెలవుల్లో జాకీచాన్ సినిమా పక్కాగా వచ్చేది. దీంతో ఆ సమయంలో యాక్షన్ ను ఇష్టపడే వారందరూ టీవీలకు అతుక్కుపోయేవారు.

Jackie Chan | తండ్రి గూడ‌ఛారి..

ప్ర‌పంచ ప్రఖ్యాత నటుడు జాకీ చాన్ తండ్రి చార్ల్స్ చాన్ గూఢ‌చారి (స్పై)గా SPY పనిచేసిన‌ట్లు తాజాగా వెల్ల‌డైంది. ఈ స‌మాచారం జాకీ చాన్ త‌న తండ్రితో చేసిన సంభాషణ‌లో త‌న‌కు తెలిసింది. చార్ల్స్ చాన్ 1940ల‌లో క్వోమింటాంగ్ (కువోమిన్‌టాంగ్) ప్రభుత్వానికి గూఢ‌చారి‌గా పనిచేసిన‌ట్లు తెలుస్తోంది. చైనా సివిల్ వార్(Chinese Civil War) సమయంలో కమ్యూనిస్టుల నుండి తప్పించుకోవ‌డానికి చార్ల్స్ చాన్ హాంకాంగ్‌కు పారిపోయారు. అక్కడే జాకీ చాన్ తల్లి లీ-లీ చాన్‌ను కలిశారు. లీ-లీ చాన్ శాంఘైలో ఓపియం స్మగ్లర్‌గా, గ్యాంబ్లర్‌గా, అండ‌ర్‌వ‌ర్డ్‌లో కీల‌క పాత్ర పోషించారు. ఈ విషయాలు జాకీ చాన్‌కు తండ్రితో జ‌రిపిన సంభాషణలో తెలిసాయి.

- Advertisement -

ఈ గూఢ‌చారి నేప‌థ్యంలో జాకీ చాన్(Jackie Chan) జీవితంలో అనేక ఆస‌క్తిక‌ర అంశాలు ఉన్నాయి. ఆయ‌న చిన్న‌వ‌య‌సులో ఏదో కోల్పోయిన‌ట్టు ఉండేవారు. పాఠ‌శాల‌కు వెళ్ల‌కుండా, పుస్త‌కాల‌ను విసిరేసేవారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తల్లిదండ్రులు ఆయ‌న‌ను మార్ష‌ల్ ఆర్ట్స్ పాఠ‌శాల‌కు పంపించారు. అక్కడే ఆయ‌న‌కు మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్ష‌ణ ల‌భించింది. ఆ శిక్ష‌ణే ఆయ‌న‌ను సినిమా Cinema రంగంలోకి తీసుకెళ్లింది. జాకీ చాన్ తండ్రి చార్ల్స్ చాన్ 2008లో, తల్లి లీ-లీ చాన్ 2002లో మ‌ర‌ణించారు. వారి అంత్య‌క్రియ‌లు ఆస్ట్రేలియాలోని క్యాన్బెర్రాలో జ‌రిపారు. గూఢ‌చారి నేప‌థ్యంలో జాకీ చాన్ జీవితంలో అనేక ఆస‌క్తిక‌ర అంశాలు ఉన్నాయి. ఆయ‌న తండ్రి గూఢ‌చారి పాత్ర ఆయ‌న జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింద‌నే దానిపై ఇంకా అనేక చర్చ‌లు జ‌రుగుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News