ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | వారికి రూ.కోటి చొప్పున నగదు పురస్కారం అందించిన సీఎం

    CM Revanth Reddy | వారికి రూ.కోటి చొప్పున నగదు పురస్కారం అందించిన సీఎం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:CM Revanth Reddy | తెలంగాణ ఆవిర్భావ వేడుకలను సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్​లోని పరేడ్​ గ్రౌండ్​(Secunderabad Parade Ground)లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి రూ.కోటి చొప్పున నగదు పురస్కారం అందజేశారు.

    తెలంగాణ (Telangana) ఉద్యమం కోసం ఎంతోమంది కవులు, కళాకారులు పని చేశారు. తమ కవితలు, పాటలతో ఉద్యమానికి ఊపు తెచ్చారు. తెలంగాణ సాధనలో నాడు కవులు, కళాకారుల పాత్ర మరువలేనిది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి రూ.కోటి చొప్పున నగదు సాయం చెక్కును అందజేశారు.

    CM Revanth Reddy | పురస్కారం అందుకున్నది వీరే..

    తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన తొమ్మిది మందికి సీఎం రాష్ట్ర ఆవిర్భావ(Telangana Formation Day) వేడుకల్లో చెక్కులు అందజేశారు. నగదు పురస్కారాలు అందుకున్న వారిలో ఎక్కా యాదగిరి రావు, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి ఉన్నారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి తరఫున వారి కుటుంబ సభ్యులు నగదు పురస్కారాన్ని అందుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరెటి వెంకన్న తరఫున ఆమె కూతురు చెక్కు తీసుకున్నారు. వీరికి నగదు పురస్కారంతో పాటు ఇంటి స్థలం ఇస్తామని సీఎం ప్రకటించారు.

    More like this

    Nizamabad City | బోర్గాం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | గుర్తు తెలియని వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన...

    Congress | కొత్త ఉప రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ అభినంద‌న‌.. నిష్పాక్షికంగా వ్య‌వ‌హరించాల‌ని విజ్ఞ‌ప్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్...

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...