ePaper
More
    HomeజాతీయంBollywood Top Singer | పాక్ బుద్దిని బ‌య‌ట‌పెట్టిన అద్నాన్ సమీ.. ఆ దేశ వైఖరి...

    Bollywood Top Singer | పాక్ బుద్దిని బ‌య‌ట‌పెట్టిన అద్నాన్ సమీ.. ఆ దేశ వైఖరి వల్ల త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌కు వెళ్ల‌లేక‌పోయా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bollywood Top Singer | అద్నాన్ సమీ (Adnan sami).. బాలీవుడ్‌లో టాప్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నారు. అలాగే తెలుగులోనూ అద్నాన్ చాలా పాటలు పాడారు. ఇందులో ప్రధానంగా దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీత సార‌థ్యంలో పాట‌లు పాడారు. ఇక సంగీతంలో చేసిన కృషికి గాను అద్నాన్ సమీని 2020లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. బాలీవుడ్‌తో పాటు పలు దక్షిణాది చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన అద్నాన్ సమీకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన పాటలు పాడే స్టైల్ డిఫరెంట్‌గా ఉండడంతో అభిమానులు ఫిదా అవుతారు.

    Bollywood Top Singer | బ‌య‌టపెట్టాడు..

    కొన్ని నెల‌ల క్రితం అద్నాన్ తల్లి బేగమ్ నౌరీన్ సమీ ఖాన్(77) అనారోగ్య కారణాలతో మరణించారు. ఈ విషయాన్ని అద్నాన్ సమీ(Adnan Sami) స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తన తల్లి ఈ లోకంలో లేదనే వార్తను తాను జీర్ణించుకోలేకపోతున్నానని.. తన కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయిందని అద్నాన్ ఈ సందర్భంగా తెలిపారు. అద్నాన్ తల్లి మృతిపట్లు పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు తమ సంతాపం తెలిపారు. అయితే పాకిస్థాన్‌కి (Pakistan) చెందిన అద్నాన్ భారత పౌరసత్వం పొందిన విషయం తెలిసిందే. అద్నాన్ సమీ 1971 ఆగస్టు 15న లండన్‌(London)లో జన్మించాడు. అతని తండ్రి అర్షద్ సమీ ఖాన్ పాకిస్థాన్‌లోని ఆఫ్ఘన్‌కు చెందిన పష్టూన్, అతని తల్లి నౌరీన్ ఖాన్ జమ్మూకి చెందినవారు. అద్నాన్ తండ్రి పాకిస్తాన్ వైమానిక దళంలో పైలట్‌గా చేరి తర్వాత సీనియర్ ప్రభుత్వ అధికారి అయ్యారు. ఆయన 14 దేశాలకు పాకిస్తాన్ రాయబారిగా పనిచేశాడు. అద్నాన్ సమీ పాకిస్తానీ అయినప్పటికీ 2016లో భారతీయ పౌరసత్వానికి అర్హత సాధించాడు.

    తాజాగా అద్నాన్ స‌మీ పాకిస్తాన్ వ‌క్ర‌బుద్ధిని బ‌య‌ట‌పెట్టారు. తన తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి పాకిస్తాన్ తనకు వీసా నిరాకరించిందని అద్నాన్ సమీ వెల్లడించారు. వీడియో కాల్ (Video call) ద్వారా తాను అంత్యక్రియలను చూడాల్సి వచ్చిందని అతను చెప్పారు. నా త‌ల్లికి ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవు. ఆమె ఊహించ‌ని విధంగా క‌న్నుమూశారు. భారత అధికారులు(Indian officers) న‌న్ను కరుణించారు కానీ పాక్ నాకు వీసా ఇవ్వ‌కుండా ఇబ్బందికి గురి చేసింద‌ని చెప్పుకొచ్చారు అద్నాన్ సమి.

    More like this

    Balapur Ganesh | రికార్డు ధర పలికిన బాలాపూర్​ గణేశుడి లడ్డూ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balapur Ganesh | లడ్డూ వేలం అనగానే గుర్తొచ్చిది బాలాపూర్​ వినాయకుడు. ఏళ్లుగా ఈ...

    Rohit Sharma | రోహిత్ శ‌ర్మ కారుని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ముంబైలో మ‌నోడికి ఇంత ఫాలోయింగా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Rohit Sharma | టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకి ఉన్న‌ క్రేజ్...

    Team India Jersey | టీమ్ ఇండియా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అడిడాస్ జెర్సీలపై ఏకంగా అంత‌ భారీ తగ్గింపా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Team India Jersey | టీమిండియా అభిమానులకు శుభవార్త! టీమ్ ఇండియా అధికారిక కిట్...