అక్షరటుడే, వెబ్‌డెస్క్:Army Jawan | దేశ సరిహద్దుల్లో మన రక్షణ కోసం పని చేసే జవాన్లకు రక్షణ కరువైంది. సరిహద్దుల్లో ఇతర దేశాల నుంచి మన భూ భాగాన్ని కాపాడుతున్న సైనికులు(Soldiers) తమ భూములను రక్షించుకోలేకపోతున్నారు. సైనికుల భూములను కొందరు కబ్జా చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా(Sri Satya Sai District) హుదుగూరులో ఆర్మీ జవాన్(Army Jawan) నరసింహమూర్తిభూమిని కొందరు కబ్జా చేశారు.
Army Jawan | న్యాయం చేయాలని వినతి
జమ్మూ(Jammu)లో పని చేస్తున్న నరసింహమూర్తి తనకు న్యాయం చేయాలని అక్కడి నుంచే వీడియో విడుదల చేశాడు.తన భూమి కబ్జా చేశారని అందులో వాపోయాడు. కబ్జాదారుల నుంచి తన భూమిని కాపాడాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh)ను కోరారు. భూమి తనదేనని కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే కోర్టు తీర్పును రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు(Revenue Officers), పోలీసులు(Police) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. మరోవైపు ఇటీవల సత్యసాయి జిల్లాలోనే మరో జవాన్ సైతం తన భూమి కబ్జా అయిందని ఫిర్యాదు చేశాడు. గోరంట్ల మండలం రాగిమోలపల్లిలో తన భూమిని కబ్జా చేశారని ఆరోపించాడు. కాగా దేశం కోసం పోరాడుతున్న సైనికుల భూములను కబ్జా చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.