ePaper
More
    HomeతెలంగాణLocal Body Election | ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే.. స్థానిక ఎన్నికల కోసమేనా?

    Local Body Election | ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే.. స్థానిక ఎన్నికల కోసమేనా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Local Body Election | రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసి దాదాపు 15 నెలలు అవుతోంది. అయినా స్థానిక సంస్థల ఎన్నికలను(Local body elections) ప్రభుత్వం నిర్వహించలేదు. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. అయితే ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం(Government) భావిస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలకు ఫోన్లు వస్తున్నాయి.

    Local Body Election | ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది..

    రాష్ట్రంలోని ప్రజలకు మీ ఎమ్మెల్యే(MLA)ల పనితీరు ఎలా ఉందని ఫోన్లు వస్తున్నాయి. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అంటూ ఆరా తీస్తున్నారు. బాగుంది, పర్వాలేదు, బాగాలేదు, చెప్పలేం అనే ఆప్షన్లతో సమాధానాలు సేకరిస్తున్నారు. అయితే ఈ సర్వే ఎవరు చేస్తున్నారో తెలియక ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా అసెంబ్లీ(Assembly), లోక్​సభ(Loksabha) ఎన్నికల సమయంలోనే ఓటర్లుకు ఫోన్లు వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఫోన్​ చేసి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేస్తుండడంపై ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

    Local Body Election | ప్రభుత్వమే చేయిస్తుందా..

    రాష్ట్రంలో కాంగ్రెస్​(Congress) అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్​ ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకునేందుకే ప్రభుత్వమే ప్రైవేట్​ ఏజెన్సీ(Private Agency)లతో సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఎలా పని చేస్తున్నారు.. ప్రజలతో ఎలా ఉంటున్నారని వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సమాయాత్తం అవుతున్న తరుణంలో ఈ సర్వే చర్చనీయాంశంగా మారింది.

    Local Body Election | సీఎం ప్రత్యేక దృష్టి

    స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా నేడు పలు పథకాలను కూడా ప్రారంభించనున్నారు. ఇదివరకే ఆయన కాంగ్రెస్​ ఎమ్మెల్యే(Congress MLA)లతో విడివిడిగా సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన ఇదివరకే ఆదేశించారు. దీంతో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

    Local Body Election | ఎమ్మెల్యేల్లో ఆందోళన

    సర్వే గురించి స్పష్టత లేకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. తమ పనితీరుపై ఓటర్లు ఏం చెబుతారోనని వారు ఆలోచిస్తున్నారు. ఈ సర్వే వివరాలు హైకమాండ్​(High Command)కు చేరితే ఏమైనా చర్యలు ఉంటాయా అని భయపడుతున్నారు. మరో వైపు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారు సైతం సర్వే గురించి ఆందోళన చెందుతున్నారు.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...