అక్షరటుడే, ఇందూరు: Telangana Formation Day | ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు (Police Parade Ground) రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (State Mineral Development Corporation) ఛైర్మన్ ఈరవత్రి అనిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (Telangana Tourism Development Corporation) ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపం (Telangana Martyrs’ Monument) వద్ద నివాళులర్పించారు. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, సీపీ సాయిచైతన్య, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర స్థూపం వద్ద నివాళులర్పించారు.

నివాళులర్పిస్తున్న కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు

నివాళులర్పిస్తున్న సీపీ సాయి చైతన్య

కామారెడ్డిలో జెండాకు వందనం చేస్తున్న తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి